iDreamPost
android-app
ios-app

15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. ఎక్కడంటే!

  • Published Dec 01, 2023 | 1:17 PM Updated Updated Dec 01, 2023 | 1:17 PM

ఇటీవల పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు, జనసందోహంగా ఉండే ప్రదేశాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం.. పోలీసులు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి ఏమీ లేవని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇటీవల పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు, జనసందోహంగా ఉండే ప్రదేశాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం.. పోలీసులు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి ఏమీ లేవని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. ఎక్కడంటే!

ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు, బస్ స్టాండ్స్, షాపింగ్ మాల్స్, స్కూల్స్-కళాశాలతో పాటు పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు, బడా వ్యాపారులకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం చూస్తూనే ఉన్నాయి. బెదిరింపు కాల్స్ రాగానే వెంటనే పోలీసులు బాంబ్ స్క్వాడ్స్, డాగ్స్ తో ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఎలాంటి అనుమానిత వస్తువులు లేవని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటారు. కొన్నిసార్లు మాత్రం నిజంగానే బాంబ్ బ్లాస్టింగ్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా బెంగుళూరులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పలు పాఠశాలల్లో బాంబులు పెట్టినట్టుగా.. అవి పేలుస్తామని  అజ్ఞాత వ్యక్తి నుంచి మెయిల్స్  రావడంతో పాఠశాల యాజమాన్యం హడలిపోయారు. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులో పదిహేను పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాదాపు అరగంట వ్యవధిలో 15 కు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇ-మెయిల్స్ అందడంతో అటు యాజమాన్యం ఇటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి ఇ-మెయిల్స్ పంపించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాఠశాల యాజమాన్యం సహా విద్యార్థులు ఇతర సిబ్బందిని పోలీసులు ఖాళీ చేయించారు. మొదట ఏడు పాఠశాలలపై బాంబ్ అటాక్ జరుగుతాయని బెదిరింపులు వచ్చాయి. బసవేశ్వర్ నగర్ లోని నెపెల్, విద్యాశిల్ప పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి ఎదురుగా ఉన్న పాఠశాలకు ఈ బెదిరింపులు రావడం గమనార్హం. మరి కాసేపటి తర్వాత మరో ఎనిమిది పాఠశాలకు అలాంటి బెదిరింపు ఇ-మెయిల్స్ రావడంతో స్థానికంగా కలకలం రేపింది. వెంటనే స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు యుద్ద ప్రాతిపదికన చర్యలకు సిద్దమయ్యారు. పాఠశాలకు గట్టి భద్రతా చర్యలు కల్పించారు. బాంబ్ స్వ్యాడ్, డాగ్స్ రంగంలతోకి దిగి తనిఖీలు చేపట్టారు. అయితే అనుమానించదగ్గ వస్తువులు ఆయా పాఠశాలల్లో లభించలేదని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మెయిల్స్ ఆధారంగా నిందితున్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపుల విషయం గురించి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. సదాశివ నగర్ లో నీవ్ అకాడమీని సందర్శించి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన బెంగుళూర్ సిటీ పోలీస్ కమీషనర్ బి దయానంద మాట్లాడుతూ.. పరిస్థితి అంతా కంట్రోల్ గా ఉందని.. ఎలాంటి భయాందోళన అవసరం లేదని బాంబు బెదిరింపులు అంతా భూటకపు సంకేతాలు అని తెలిపారు.