Arjun Suravaram
Bengaluru News: ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కావడం సహజం. కానీ బెంగళూరులో ఓ విచిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఓ జాబ్ మేళాకు సీనియర్ సిటిజన్లు భారీగా తరలివచ్చారు. ఎందుకంటే..
Bengaluru News: ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కావడం సహజం. కానీ బెంగళూరులో ఓ విచిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఓ జాబ్ మేళాకు సీనియర్ సిటిజన్లు భారీగా తరలివచ్చారు. ఎందుకంటే..
Arjun Suravaram
నేటికాలంలో నిరుద్యోగ సమస్య అధికంగానే ఉంది. ఎంతో మంది యువత జాబ్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు అయితే చిన్న జాబ్ దొరికిన చాలు అనే భావనలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. ఒక్కడ జాబ్ ఇంటర్వ్యూలు జరుగుతున్న పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరవుతుంటారు. ఇలా ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కావడం సహజం. కానీ బెంగళూరులో ఓ విచిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఓ జాబ్ మేళాకు సీనియర్ సిటిజన్లు భారీగా తరలివచ్చారు. మరి.. అంతమంది ఎందుకు వచ్చారు. అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని నైటింగేల్స్ మెడికల్ ట్రస్ ఆధ్వర్యంలో జాబ్ మేళ జరిగింది. లాంగ్ ఫోర్ట్ రోడ్ లోని సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఇంజినీరింగ్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, సూపర్ వైజరీ, సెక్యూరిటీ వంటి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. అయితే ఈ జాబ్ మేళ విశేషం ఏమిటంటే.. ఇది కేవలం సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకం ఏర్పాటు చేసింది.
ఇక ఈ జాబ్ మేళాకు ఎవరు వస్తారులే అని అందరు భావించారు. అయితే ఊహించని స్థాయిలో భారీగానే సీనియర్ సిటిజన్లు హాజరయ్యారు. 13 వందల మంది సీనియర్ సిటిజన్స్ ఉద్యోగాల కోసం క్యూ కట్టారు. తమ తమ రెజ్యూమ్ అప్ డేట్ చేసుకుని, ఇప్పటికీ తమకు ఉద్యోగం చేసే సత్తా ఉందంటూ జామ్ మేళాకు తరలి వచ్చారు. ఇలా సీనియర్ సిటినజ్ల కోసం ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో ఊహించని విధంగా 1000పైగా ఉద్యోగాలు ఇస్తామంటూ.. ఏకంగా 72 కంపెనీలు ముందుకు వచ్చాయి. అదే విధంగా సీనియర్ సిటిజన్స్ పెద్ద సంఖ్యలోనే ఈ మేళాకు హాజరయ్యారు. ఆయా కేటగిరీ కింద క్యూ లైన్ లో నిల్చొని మరీ తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
అయితే వృద్దాప్యంలో హాయిగా ఇంట్లో ఉండొచ్చు కదా.. మళ్లీ జాబ్ ఎందుకు చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నలు ఎదురవ్వగా… ఒక్కొక్కరూ ఒక్కో ఎమోషనల్ స్టోరీ చెప్పారు. తన కొడుకు, కుమార్తెపై ఆధారపడటం ఇష్టం లేదని, అందుకే ఏదో ఒక ఉద్యోగం చేయాలని ఈ జాబ్ మేళాకు వచ్చాను ఓ పెద్దాయన చెప్పుకొచ్చారు. తమకు పిల్లలు లేరని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, ఇంటి ఖర్చుల కోసం జాబ్ చేయాలని అనుకున్నట్లు 63 ఏళ్ల ఓ మహిళ తమ బాధలు వివరించింది. తాను ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ ఉద్యోగానికి వచ్చాను అని మరో సీనియర్ సిటిజన్ తన ఆవేదను వ్యక్తం చేశఆడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో తిరిగి జాబ్ చేయాలని సీనియర్ సిటిజన్స్ అనుకోవడంపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.