Arjun Suravaram
Seema Haider: భారత్ లోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌తో పరిచయం ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా అయోధ్యలో వేడుక వేళ మరోసారి సీమా హైదర్ వార్తల్లోకెక్కింది.
Seema Haider: భారత్ లోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌తో పరిచయం ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా అయోధ్యలో వేడుక వేళ మరోసారి సీమా హైదర్ వార్తల్లోకెక్కింది.
Arjun Suravaram
సీమా హైదర్..ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చి వార్తల్లో నిలిచిన మహిళ. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన యూపీకి చెందిన సచిన్ కోసం సీమా తన నలుగురి పిల్లలతో పాకిస్తాన్ నుంచి భారత్ లోకి అడుగు పెట్టింది. ఆ సమయంలో అక్రమంగా భారత్ లోకి అడుగు పెట్టిన ఆమె సెలబ్రిటీగా మారిపోయారు. తన ప్రియుడు సచిన్ ను పెళ్లాడిన సీమా వైవాహిక జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం తన ప్రియుడు సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రఘుపూర్‌లో ఈమె నివసిస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేళ ఓ పని చేసి మరోసారి సీమా హైదర్ వార్తల్లో నిలిచింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కోట్లాది మంది హిందువులు, ఏళ్ల తరబడి కన్న కల మరో రెండు రోజుల్లో నిరవేరబోతుంది. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు రామయ్యపై తమ భక్తివి వివిధ రూపాల్లో చూపిస్తున్నారు. కొందరు ఆయన విగ్రహాలను రూపొందించడం, మరికొందరు చిత్రాలు గీయడం, మరికొందరు రాములోరి కీర్తనలు గానం చేయడం వంటివి చేస్తుంటారు. అంతేకాక ప్రత్యేక పూజలు చేస్తూ, రామకీర్తనలతో న్యత్యం చేస్తూ ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.
అలా ఎంతో మంది రాముడిపై తమకు ఉన్న భక్తిని చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలానే ప్రేమికుడి కోసం పాకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చిన ముస్లిం మహిళ సీమా హైదర్ రాము పాటను స్మరించి వార్తల్లో నిలిచారు. శ్రీరాముని కీర్తన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ముస్లిం మహిళ అయిన సీమా హైదర్ హిందూ ఆరాధన చేయడం విశేషంగా నిలిచింది. సీమాతో పాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్ చాలీసా పఠించారు. ప్రస్తుతం సీమా పాడిన రామ కీర్తన నెట్టింట్లో వైరల్‌గా మారింది.
సచిన్, సీమా దంపతులు రబూపురాలో నివసిస్తున్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో ఈ దంపతులు రాముడి భజన ఏర్పాటు చేశారు. సీమా దంపతులు రాముడి కీర్తనలు, హానుమాన్ భక్తి గీతాలను పాడారు. ఇదే సమయంలో స్వాతి మిశ్రా పాడిన ‘రామ్ ఆయేంగే’ అనే పాటను సీమా ఆలపించారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి సీమా..ఎంతో చక్కగా రాముడి పాట ఆలపించారు. ఆమెతోపాటు తన కుమారుడు కూడా హనుమాన్ చాలిసా పఠించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తనకు అనుమతి లభించిన వెంటనే కుటుంబంతో కలిసి అయోధ్యలోని రామదర్శనం కోసం వెళతానని సీమ తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. తాను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని, భారత్ మహిళలను గౌరవించే దేశమని సీమా చెప్పుకొచ్చారు. తను ఇప్పుడు పూర్తి హిందువుగా మారినట్లు ఆమె తెలిపారు. తాను శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని అన్నారు. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నారు. మరి.. రామయ్యపై సీమా హైదర్ పాడిన పాట వీడియోను మీరు వీక్షించింది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.