iDreamPost
android-app
ios-app

తల్లి కాబోతున్న సీమా హైదర్- సచిన్ జంట! కొత్త ఏడాది గుడ్ న్యూస్!

  • Published Jan 02, 2024 | 7:28 PM Updated Updated Jan 02, 2024 | 7:28 PM

పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ఇండియా కుర్రాడి ప్రేమలో పడి.. అతడి కోసం పాక్ నుండి వచ్చేసిన సీమా హైదర్ గుర్తుందా. భర్తను వదిలేసి.. నలుగురు పిల్లల్ని తీసుకుని సరిహద్దులు దాటి వచ్చిన సీమా హైదర్ ఇప్పుడో గుడ్ న్యూస్ చెప్పింది.

పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ఇండియా కుర్రాడి ప్రేమలో పడి.. అతడి కోసం పాక్ నుండి వచ్చేసిన సీమా హైదర్ గుర్తుందా. భర్తను వదిలేసి.. నలుగురు పిల్లల్ని తీసుకుని సరిహద్దులు దాటి వచ్చిన సీమా హైదర్ ఇప్పుడో గుడ్ న్యూస్ చెప్పింది.

  • Published Jan 02, 2024 | 7:28 PMUpdated Jan 02, 2024 | 7:28 PM
తల్లి కాబోతున్న సీమా హైదర్- సచిన్ జంట! కొత్త ఏడాది గుడ్ న్యూస్!

ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నిరూపించింది పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. భర్త, నలుగురు పిల్లలున్న ఈ మహిళ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే వ్యక్తి ప్రేమ కోసం ఖండాంతరాలు దాటి వచ్చిన సంగతి విదితమే. పబ్జీలో మొదలైన పరిచయం.. స్నేహంగా మారి.. ప్రేమకు కారణమైంది. సచిన్ ప్రేమలో మునిగి తేలిన సీమా.. అతడి కోసం నేపాల్ మీదుగా ఇండియాకు వచ్చింది. భర్తను వదిలి.. తన నలుగురి పిల్లలతో యుపికి చేరుకుని ప్రియుడ్ని మనువాడింది. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడం.. తిరిగి స్వదేశానికి వెళ్లనని తేల్చి చెప్పడం, ఇక్కడే ఉంటానని పేర్కొనడం వంటి పరిణామాలు చక చకా జరిగాయి. ఒకానొక క్రమంలో ఆమె పాకిస్తాన్ ఏజెంట్ అన్న వార్తలు వచ్చాయి.

ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు కూడా విచారణ చేపట్టారు. సచిన్, అతడి తండ్రిని అరెస్టు చేయగా.. బెయిల్ పై విడుదలయ్యారు. వీరి ప్రేమ కథ చాలా దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. వీరిని స్ఫూర్తిగా తీసుకుని సరిహద్దు ప్రేమ కథలు ఊపిరి పీల్చుకున్నాయి. అంజు-నస్రుల్లా, విఘ్నేశ్వరి-లక్ష్మణ్ ఇలాంటి ఎన్నో ప్రేమ కథలు.. తమ లవ్‌ను సక్సెస్ చేసుకున్నాయి. తమ లవర్స్ కోసం విదేశాల నుండి వచ్చేశారు విదేశీ వనితలు.  పాక్ నుండి ప్రియుడి కోసం వచ్చిన సీమా హైదర్ ఇండియాలో ఓ సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని, ఓ మూవీలో రా ఏజెంట్ గా నటిస్తుందంటూ వార్తలు వెలువడ్డాయి.

అయితే ఈ న్యూ ఇయర్ వేళ సీమా హైదర్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నానంటూ సీమా హైదర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వార్తను కన్ఫమ్ చేశాడు సచిన్ కూడా. ఆమె గర్భవతి అనే విషయాన్ని తెలిపాడు. అయితే ఈ విషయం తెలిసి చాలా మంది కంగ్రాట్స్ తెలుపుతున్నారు ఈ దంపతులకు. అలాగే అంజు-నస్రుల్లా మీరెప్పుడూ శుభవార్త చెబుతున్నారంటూ వారిని టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఈ వార్తతో మళ్లీ ట్రెండ్ అవుతోంది సీమా-సచిన్ జంట.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet