Arjun Suravaram
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇంట్లో సనాతన ధర్మ పాఠశాల ఏర్పాటు కానుంది. ఆయనకు సంబంధించిన ఆస్తుల విషయంలో ప్రభుత్వం కీలక చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే పాఠశాల ఏర్పాటు కానుంది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇంట్లో సనాతన ధర్మ పాఠశాల ఏర్పాటు కానుంది. ఆయనకు సంబంధించిన ఆస్తుల విషయంలో ప్రభుత్వం కీలక చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే పాఠశాల ఏర్పాటు కానుంది.
Arjun Suravaram
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1993 ముంబాయి పేలుళ్లతో పాటు దేశంలో జరిగిన పలు దాడులు, నేరాలతో దావూద్ కి సంబంధం ఉంది. దావూద్ అనుచరులే ముంబయిలో మారణహోమానికి తెగబడ్డారు. ఆ పేలుళ్ల తర్వాత దేశం విడిచి దావూద్ పారిపోయాడు. దుబాయ్ అక్కడ నుంచి పాకిస్థాన్ వెళ్లి తలదాచుకున్నాడు. ఇటీవలే అతడిపై విషయ ప్రయోగం జరిగిందని, చావు బతుకుల్లో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అతడికి సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. దావూద్ ఇబ్రహీం ఉన్న బంగ్లాలో సనాతన ధర్మ పాఠశాల ఏర్పాటు కానుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం దేశంలో ఎన్నో అరాచాకాలు సృష్టించాడు. చివరకు భారత దేశం వదలి పాకిస్థాన్ కి పారిపోయాడు. దీంతో అతడి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం పాట నిర్వహిస్తున్నారు. తాజాగా ఇబ్రహీం కు చెందిన ఆస్తికి వేలంలో ఊహించని రేటు వచ్చింది. కనీస ధర రూ. 15 వేల రూపాయలుగా నిర్ణయించగా.. ఏకంగా 2 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. దావూద్ ఇబ్రహీంకు వారసత్వంగా వచ్చిన నాలుగు ఆస్తులు వేలంలో విక్రయించబడ్డాయి.
నాలుగు ఆస్తుల్లో రెండు పొలాలు, ఇంటిని ఓ న్యాయవాది భారీ ధరకు సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబాకే గ్రామంలో దావూద్ పూర్వీకులు నివాసం ఉండే వారు. అక్కడి నుంచి వారి పూర్వీకులు ముంబాయికి వచ్చారు. ఆ గ్రామంలో ఓ ప్లాట్ తో పాటు ఆయనకు నాలుగు రకాల ఆస్తులు దావూద్ కి వారసత్వంగా వచ్చాయి. వాటినే తాజాగా వేలం వేయ్యగా న్యాయవాది దక్కించుకున్నారు.ముంబైలో వివిధ నేరాలకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక పలు క్రిమినల్, ఇతర కేసులు నమోదైన నేపథ్యంలో దావూద్ కి చెందిన వివిధ ఆస్తులను ప్రభుత్వం హస్తగతం చేసుకుంది.
ఈ క్రమంలోనే 2020లో ముంబాకేలోని నాలుగు ఆస్తులను 2020లో వేలం వేసింది. ఇందులో పాల్గొన్న లాయర్ అజయ్ శ్రీవాస్తవ.. రూ.2.01 కోట్లు ఖర్చు పెట్టి వాటిని దక్కించుకున్నాడు. దావూద్ ఇబ్రహీంకు చెందిన ఓ ప్లాట్ ను సదరు లాయర్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కోనుగోలు చేసిన ఆ ఇంట్లో పునరుద్ధరించి సనాతన ధర్మ పాఠశాలను ఏర్పాటు చేయనని ఆయన ప్రకటించారు. సౌత్ ముంబైలోని ఆయ్కార్ భవన్‌లో ఈ వేలం ప్రక్రియ జరిగింది. ఇక దావూద్ గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తోన్నాయి. తాజాగా సదరు లాయరు చెప్పిన వ్యాఖ్యలపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు. మరి.. దావూద్ ఇంట్లో సనాతన ధర్మ పాఠశాలను ఏర్పాటు చేయనుడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండియ