iDreamPost
android-app
ios-app

జాగ్రత్త.. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే రేషన్ కార్డు రాదు!

  • Published Aug 05, 2024 | 1:08 PM Updated Updated Aug 05, 2024 | 1:08 PM

Ration Card Rules: దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదల కోసం రేషన్ కార్డు అందిస్తుంది ప్రభుత్వం. కానీ.. కొంతమంది అధికారుల పుణ్యమా అని అర్హత లేని వారు రేషన్ కార్డు పొందుతూ పొందుతూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటున్నారు.

Ration Card Rules: దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదల కోసం రేషన్ కార్డు అందిస్తుంది ప్రభుత్వం. కానీ.. కొంతమంది అధికారుల పుణ్యమా అని అర్హత లేని వారు రేషన్ కార్డు పొందుతూ పొందుతూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటున్నారు.

జాగ్రత్త.. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే రేషన్ కార్డు రాదు!

జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం.. నిరుపేద కుటుంబాలకు చెందినవారికి ఆహారశాఖ ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేయబడతాయి. ఈ రేషన్ కార్డుల ద్వారా పేదలకు ప్రభుత్వ పథకాలు అందుతాయి. పలు రాష్ట్రాల్లో రేషన్ కార్డులు పొందటానికి ఆన్ లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తులను అందజేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్ లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే రేషన్ దరఖాస్తులను స్వీకరిస్తుంటారు. భారత ప్రభుత్వ రేషన్ కార్డు పొందలాంటే నిర్ధిష్ట అర్హతలను ప్రమాణాలను నిర్ధేశించింది.  దరఖాస్తు‌దారుడికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించి అర్హుడు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత రేషన్ కార్డు జారీ చేస్తుంటారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారమే.. కొత్త రేషన్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది.  అవి ఏంటో చూద్దాం.

ఇవి మీ ఇంట్లో ఉంటే రేషన్ కార్డుకు అర్హులు కారు :

  • మీకు ఫ్లాట్ లేదా ఇల్లు తో సహా 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ భూమి ఉంటే రేషన్ కార్డుకు అర్హులు కాదు
  • కారు లేదా ట్రాక్టర్ వంటి పోర్ వీలర్ వెహికిల్స్ ఉంటే రేషన్ కార్డు రాదు
  • ఇంట్లో ఫ్రిజ్, ఏసీ ఉన్నవారు రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా ప్రకటించింది
  • కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే వారు రేషన్ కార్డుకు అర్హులు కాదు
  • కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.2 లక్షలు, నగరాల్లో రూ.3 లక్షల లోపు ఉండాలి. అంతకు మించిన ఆదాయం ఉంటే రేషన్ కార్డుకు అర్హులు కాదు
  • ప్రతి సంవత్సరం ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేసేవారు రేషన్ కార్డుకు అర్హులు కాదు
  • లైసెన్స్ పొందిన ఆయుధాలు కలిగి ఉంటే వారు కూడా రేషన్ కార్డుకు అర్హులు కాదు
  • మీరు తప్పుడు పత్రాలు అందించి రేషన్ కార్డు పొందితే వెంటనే దాన్ని సంబంధింత కార్యాలయానికి వెళ్లి సరెండ్ చేయాలి
  • అంతేకాదు సరెండ్ చేసే సమయంలో చేతి‌రాతతో ఓ లెటర్ అందజేయాలి.
  • అలా చేయకుండా మీరు రేషన్ కార్డుకు అనర్హులై ఉంటే చట్టరీత్యా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.