సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పారిశుధ్య కార్మికులకు రూ. 30 లక్షల పరిహారం!

నిరంతరం వ్యర్థాల సేకరణ చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు ఏమిచ్చినా తక్కువే. వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు.

నిరంతరం వ్యర్థాల సేకరణ చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు ఏమిచ్చినా తక్కువే. వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు.

నిరంతరం వ్యర్థాల సేకరణ చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు ఏమిచ్చినా తక్కువే. వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న డ్రైనేజీల్లో మునిగి చెత్తను తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేస్తుంటారు. ఇలా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి. అయితే ఇదే విషయమై ఓ పిల్ పై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. స‌ఫాయి కార్మికులు మ‌ర‌ణిస్తే 30 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలని తీర్పును ఇచ్చింది.

డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ శుభ్రం చేస్తున్న సమయాల్లో ఊపిరాడక, విషవాయువుల కారణంగా పలువురు పారిశుధ్య కార్మికులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ్యాన్‌హోల్స్ క్లీన్ చేస్తూ ఎవ‌రైనా కార్మికుడు మ‌ర‌ణిస్తే, వారికి రూ. 30 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక‌వేళ పూర్తి అంగ వైక‌ల్యం ఏర్ప‌డితే రూ. 20 ల‌క్ష‌ల ప‌రిహారం, పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ. 10 లక్షలు ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జ‌స్టిస్ ఎస్ ర‌వీంద్ర భ‌ట్‌, అర‌వింద కుమార్‌లతో కూడిన ధర్మాస‌నం ఈ తీర్పును వెల్లడించింది.

Show comments