iDreamPost

జియో రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపుకి అదే కారణం!.. కొత్త విషయం బయటపెట్టిన నెటిజన్స్

Reason Behind Jio Tariff Rates Increase: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో.. జియో సిమ్ లు వాడేవారికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. జియో టారిఫ్ రేట్లను పెంచుతూ కీలక ప్రకటన చేసింది. అయితే ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా పెంచడానికి కారణం అదే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Reason Behind Jio Tariff Rates Increase: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో.. జియో సిమ్ లు వాడేవారికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. జియో టారిఫ్ రేట్లను పెంచుతూ కీలక ప్రకటన చేసింది. అయితే ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా పెంచడానికి కారణం అదే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

జియో రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపుకి అదే కారణం!.. కొత్త విషయం బయటపెట్టిన నెటిజన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం బిజినెస్ రిలయన్స్ జియోకి సంబంధించి టారిఫ్ ప్లాన్స్ న్యూస్ సవరించింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచేసింది. దీంతో జియో యూజర్లకు గట్టి షాక్ తగిలినట్టయ్యింది. కాగా ఈ రీఛార్జ్ ప్లాన్ ధరలు జూలై 3 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే ఇప్పుడు అంబానీ జియో టారిఫ్ ప్లాన్ ధరలను పెంచడానికి అనంత్ అంబానీ పెళ్లే కారణమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకను ముఖేష్ అంబానీ అంగరంగవైభవంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక కోసం 1200 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీరి పెళ్లి కోసం చేయించిన ఖరీదైన శుభలేఖలను అతిథులకు పంపించి వార్తల్లో నిలిచారు.

పెళ్లి పనుల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పెళ్లి మా చావుకి వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి ఖర్చులను రాబట్టడం కోసమే జియో రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశారని అంటున్నారు. ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి ఖర్చులను మా నుంచి వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పెళ్లి ఖర్చుల భారాన్ని జియో యూజర్లపై వేయడం సరికాదని.. దేశ ప్రజలపై ఆ భారాన్ని వేయడం సరికాదని అంటున్నారు. అయితే రీఛార్జ్ ప్లాన్స్ ని పెంచడానికి వేరే కారణం ఉందని.. అనంత్ అంబానీ పెళ్లికి, టారిఫ్ ప్లాన్స్ పెంపుకి ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.

జియో ఇలా ఒక్కసారిగా టారిఫ్ రేట్లను పెంచేయడంతో.. మరోవైపు వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ నెట్వర్క్ కూడా టారిఫ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. ఎప్పుడెప్పుడు పెంచుదామా అని చూస్తున్న ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు.. జియో పెంపుతో ముందుకొచ్చాయి. ఆదాయం పెంచుకోవడం కోసం ఈ రెండు కంపెనీలు ప్లాన్స్ లో రేట్లను సవరించాయి. కాగా దేశంలోని టెలికాం ఆపరేటర్లు 5జీ కోసం అవసరమైన ఇన్ఫ్రా స్ట్రక్చర్, టెక్నాలజీ కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఈ డబ్బును తిరిగి రాబట్టడం కోసమే రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచాయని నిపుణులు చెబుతున్నారు. టారిఫ్ ప్లాన్స్ పెంచడం తప్ప వేరే  దారి లేదని నిపుణులు చెబుతున్నారు. కాగా దేశంలో ఉన్న 5జీ మొబైల్స్ లో దాదాపు 85 శాతం  వాటా జియో నెట్వర్క్స్ కే ఉంది. దీంతో ఈ పెట్టుబడిని రాబట్టడం కోసం జియో తన టారిఫ్ ప్లాన్స్ ని పెంచిందని.. ఈ క్రమంలోనే వొడాఫోన్, ఎయిర్ టెల్ కంపెనీలు కూడా పెంచాయని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి