nagidream
RBI To Launch New Service For Farmers And Small Traders To Provide Easy Loans: లోన్ రావడం అంటే అంత ఈజీ కాదు. రకరకాల యాప్స్ ఓపెన్ చేసి అప్లై చేయాలి. చదువుకున్నవారికంటే ఇవన్నీ తెలుస్తాయి. మరి పెద్ద పెద్ద చదువులు చదువుకోని వారికి ఎలా తెలుస్తుంది. అందుకే యూపీఐలా ఈజీగా అర్థం చేసుకుని లోన్ కి అప్లై చేసుకునేలా ఆర్బీఐ కొత్త సేవలను తీసుకొస్తుంది.
RBI To Launch New Service For Farmers And Small Traders To Provide Easy Loans: లోన్ రావడం అంటే అంత ఈజీ కాదు. రకరకాల యాప్స్ ఓపెన్ చేసి అప్లై చేయాలి. చదువుకున్నవారికంటే ఇవన్నీ తెలుస్తాయి. మరి పెద్ద పెద్ద చదువులు చదువుకోని వారికి ఎలా తెలుస్తుంది. అందుకే యూపీఐలా ఈజీగా అర్థం చేసుకుని లోన్ కి అప్లై చేసుకునేలా ఆర్బీఐ కొత్త సేవలను తీసుకొస్తుంది.
nagidream
లోన్ రావడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. బ్యాంకుకు వెళ్లి సిబ్బందితో మాట్లాడి వస్తుందో లేదో నిర్ధారించుకుని.. వస్తుందని తెలిస్తే అప్పుడు లోన్ కి దరఖాస్తు చేసుకోవాలి. రాదని తెలిస్తే మరలా వేరే బ్యాంకుకి వెళ్ళాలి. రైతులకు, చిరు వ్యాపారులకు బ్యాంకుల చుట్టూ తిరగాలంటే పని పోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కొత్త సేవలను తీసుకొస్తుంది. నిమిషాల్లోనే ఫోన్ ద్వారా లోన్లు మంజూరయ్యేలా కొత్త సేవలను ప్రారంభిస్తుంది. యూపీఐ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మొత్తం ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. డిజిటల్ పేమెంట్స్ తో ఇండియా డిజిటల్ ఇండియాగా పరుగులు పెడుతుంది. 8 ఏళ్ల క్రితం యూపీఐని పరిచయం చేసింది ఆర్బీఐ.
ఈ యూపీఐ పుణ్యమా అని చిల్లర సమస్య పోయింది. లేదంటే ఏ షాప్ కి వెళ్లినా రూపాయి, రెండు రూపాయలు చిల్లర లేదని చేతిలో చాక్లెట్లు పెట్టేవారు. ఇలా కస్టమర్ కి చాలా నష్టం వచ్చేది. ఈ సమస్యలకు బ్రేక్ వేసింది యూపీఐ. టీ తాగినా, హోటల్ లో బిర్యానీ తిన్నా.. 10 రూపాయల నుంచి వందలు, వేల రూపాయల వరకూ యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒక విప్లవానికి నాంది పలికిన ఆర్బీఐ తాజాగా ఇప్పుడు మరో కొత్త విప్లవానికి తెరలేపింది. యూఎల్ఐ పేరుతో కొత్త సేవలను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ పేరుతో కొత్త సేవలను త్వరలోనే ప్రారభించబోతుంది. గత ఏడాది పైలట్ ప్రాజెక్ట్ కింద ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ ని స్టార్ట్ చేసిన ఆర్బీఐ.. మంచి ఫలితాలు రావడంతో దేశ వ్యాప్తంగా సేవలను అందించేందుకు సిద్ధమైంది. డిజిటల్ చెల్లింపుల విషయంలో యూపీఐ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో.. అదే విధంగా లోన్ల జారీ విషయంలో కూడా ఈ యూఎల్ఐ కూడా అంతే కీలక పాత్ర పోషించనుంది.
దేశ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జర్నీలో యూఎల్ఆయా కీలక పాత్ర పోషించేందుకు రెడీగా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ యూఎల్ఐ ద్వారా చిరు వ్యాపారులకు, గ్రామీణ ప్రాంతాల వారికి నిమిషాల్లోనే లోన్లు అందుతాయని తెలిపారు. భూమి రికార్డులు, ఇతర డిజిటల్ సమాచారం ఆధారంగా యూఎల్ఐ పని చేస్తుందని.. దీని వల్ల లోన్ ప్రక్రియ సులువు అవుతుందని పేర్కొన్నారు. లోన్ పొందేందుకు ఇక నుంచి డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం లేదని.. ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రుణాల జారీ ప్రక్రియ వేగవంతమవుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్బీఐ కీలక నిర్ణయంతో ఇప్పుడు ఎంతోమందికి మేలు చేకూరనుంది. బ్యాంకులను ఆశ్రయించకుండానే నేరుగా యూఎల్ఐ ద్వారా నిమిషాల్లోనే లోన్లు పొందవచ్చు. మరీ ముఖ్యంగా లోన్ యాప్ స్కామ్స్ బారిన పడకుండా యూఎల్ఐ అప్రూవ్ చేసిన యాప్స్ లేదా బ్యాంకుల ద్వారా లోన్లు పొందొచ్చు.