nagidream
Ratan Tata Love Towards Stray Dogs: మనుషుల్నే కుక్కలుగా చూసే సమాజం ఇది. అలాంటిది కుక్కల్ని ఇంకెంత హీనంగా చూస్తాదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సమాజం నుంచి రతన్ టాటాను వేరు చేసేదే అతని గొప్ప మనసు. మూగజీవాల పట్ల ఆయన తీసుకునే కేర్ మాటల్లో వర్ణించలేనిది.
Ratan Tata Love Towards Stray Dogs: మనుషుల్నే కుక్కలుగా చూసే సమాజం ఇది. అలాంటిది కుక్కల్ని ఇంకెంత హీనంగా చూస్తాదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సమాజం నుంచి రతన్ టాటాను వేరు చేసేదే అతని గొప్ప మనసు. మూగజీవాల పట్ల ఆయన తీసుకునే కేర్ మాటల్లో వర్ణించలేనిది.
nagidream
దేశంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, విలువలతో వ్యాపారం చేస్తున్న వారిలో రతన్ టాటా టాప్ లో ఉంటారు. ఆయన చేసే మంచి పనులకు, టాటా ట్రస్ట్ పేరుతో చేసే సేవా కార్యక్రమాలకు గాను ప్రజల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. టాటా ట్రస్ట్ పేరుతో పేదలకు చదువుకు సంబంధించి ఆర్థిక సహకారం అందించడం.. క్యాన్సర్ సహా పలు అనారోగ్య సమస్యల నుంచి పేదలకు విముక్తి కల్గించడం వంటి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. వీధి కుక్కల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీధి కుక్కల కోసం లగ్జరీ హోటల్ అయిన తాజ్ మహల్ హోటల్ నే నివాస స్థలంగా కేటాయించారు. హోటల్ లో ఎక్కడైనా సరే ప్రశాంతంగా నిద్రపోవచ్చు.. ఉండచ్చు.
సాధారణంగా చిన్న చిన్న హోటల్స్ దగ్గరకు వీధి కుక్కలు వస్తేనే తన్ని తరిమేస్తారు. అలాంటిది స్టార్ హోటల్స్, లగ్జరీ హోటల్స్ దగ్గరకి కుక్కలు వస్తే ఊరుకుంటారా? ఆ పరిసర ప్రాంతాల్లోకి కూడా రానివ్వరు. వీధి కుక్కల్ని గేటునే తాకనివ్వరు.. అలాంటిది గేటు దాటి లోపలకు వెళ్లి దర్జాగా జీవించడమే. ఇంకేమైనా ఉందా? అసలు డబ్బు లేని మనుషుల్ని కుక్కల్లా చూసే సమాజం ఇది. అలాంటిది ఫైవ్ స్టార్ హోటల్ లో వీధి కుక్కలకు అనుమతించడం అంటే చిన్న విషయం కాదు. అందుకే రతన్ టాటాను గ్రేట్ అనేది.
ప్రముఖ హెచ్ఆర్ నిపుణురాలు రూబీ ఖాన్ తన లింక్డ్ ఇన్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టులో రతన్ టాటా గారి గొప్పతనం మరోసారి బయటపడింది. రూబీ ఖాన్ ఒకసారి తాజ్ మహల్ హోటల్ కి వెళ్ళినప్పుడు ఎంట్రీ గేట్ పక్కనే ఒక వీధి కుక్క నిద్రపోతుండడాన్ని గమనించారట. అంత పెద్ద హోటల్ లోపల వీధి కుక్క ఎందుకు ఉంది అని హోటల్ సిబ్బందిని అడిగారట. సిబ్బంది చెప్పిన సమాధానం విన్న ఆమెకు రతన్ టాటా మీద గౌరవం మరింత పెరిగిందట. ఆ వీధి కుక్క పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగిందని.. హోటల్ లో ఒక భాగమైపోయిందని.. హోటల్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చే ఏ మూగజీవాన్ని అయినా సరే జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా రతన్ టాటా ఆదేశాలు ఇచ్చారని సిబ్బంది తెలిపారు.
ఈ విషయాన్ని రూబీ ఖాన్ తన లింక్డ్ ఇన్ లో పోస్ట్ పెట్టగా అది వైరల్ అయ్యింది. రతన్ టాటా గొప్ప మనసుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. రతన్ టాటా మూగజీవాలపై ఎప్పుడూ ప్రేమను వ్యక్తపరుస్తారు. వీధి కుక్కల కోసం బాంబే హౌస్ లోని తన ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేక రూమ్ కేటాయించారు. వాటి కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. వర్షాకాలంలో కార్ల కింద వీధి కుక్కలు, పిల్లులు తలదాచుకుంటాయి. వాహనాలను పోనిచ్చే ముందు కింద ఒకసారి చెక్ చేయండి అంటూ ఆయన వాహనదారులను అభ్యర్థిస్తూ ఉంటారు.