రామేశ్వరం కేఫ్ పేలుడులో ఉగ్ర కోణం! NIA రంగంలోకి.. CCTV ఫుటేజ్ వైరల్!

CM On Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడులో ఉగ్రకోణం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి స్వయంగా ఇది బాంబు పేలుడు అంటూ నిర్ధారించారు.

CM On Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడులో ఉగ్రకోణం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి స్వయంగా ఇది బాంబు పేలుడు అంటూ నిర్ధారించారు.

రామేశ్వరం కేఫ్ లో పేలుడుతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మొదటి ఈ పేలుడుకు కారణంగా గ్యాస్ సిలిండర్ పేలడం అనుకున్నారు. కానీ, ఘటనాస్థలాన్ని, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అక్కడ జరిగింది ప్రమాదం కాదని.. పక్కా పథకంతో చేసిన బాంబు పేలుడు అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం అంటూ చెప్పుకొచ్చారు. ఈ పేలుడు వ్యవహారంపై ఎన్ఐఏ కూడా దర్యాప్తు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.

బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మొదట అందరూ ఈ ఘటన కేవలం ప్రమాదం అయి ఉంటుంది అనుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుంది అనుకున్నారు. కానీ, ఈ ప్రమాదానికి కారణం తక్కువ తీవ్రత కలిగిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్(ఐఈడీ)గా భావించారు. ఒక వ్యక్తి కస్టమర్ లాగా కేఫ్ లోకి వచ్చాడు. అతనితో పాటు ఒక బ్యాగును తీసుకొచ్చాడు. ఆ బ్యాగును అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించింది. ఈ ఐఈడీ పేలుడు తక్కువ తీవ్రత కలిగినది కావడంతో.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, పేలుడు ఘటనలో మొత్తం 9 మంది గాయపడ్డారు.

ఈ పేలుడు ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా స్పందించారు. హోంమంత్రి కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం అన్నారు. ఈ పేలుడు ఘటనపై డీజీపీ అలోక్ మోహన్ కూడా స్పందించారు. పేలుడుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రికి పూర్తి సమాచారం అందించినట్లు తెలియజేశారు. ఇప్పటికే క్లూస్ టీమ్, బాంబు స్క్వాడ్ అందరూ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఈ పేలుడుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించే ఆస్కారం కనిపిస్తోంది. అయితే ఈ పేలుడుకు సంబంధించి ఎవరు చేశారు? ఏ ఉద్దేశంతో ఈ పేలుడు చేశారు? ఇది ఉగ్రవాదుల హెచ్చరికనా? అంటూ చాలానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బెంగళూరు వాసులు మాత్రం ఈ పేలుడు ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మరి.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో ఉగ్రకోణం వెలుగులోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments