iDreamPost
android-app
ios-app

Ayodhya: అయోధ్యలో రామ మందిరం పూర్తి! మరి.. మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చింది?

  • Published Jan 22, 2024 | 1:11 PM Updated Updated Jan 22, 2024 | 1:11 PM

నేడు అయోధ్యలో అట్టహాసంగా రాముల వారి ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వందల ఏళ్ళ కల పూర్తయిపోయింది. మరి, ఈ సమయంలో అక్కడ కూల్చివేసిన మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనే ఆసక్తి అందరికి నెలకొంది.

నేడు అయోధ్యలో అట్టహాసంగా రాముల వారి ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వందల ఏళ్ళ కల పూర్తయిపోయింది. మరి, ఈ సమయంలో అక్కడ కూల్చివేసిన మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనే ఆసక్తి అందరికి నెలకొంది.

  • Published Jan 22, 2024 | 1:11 PMUpdated Jan 22, 2024 | 1:11 PM
Ayodhya: అయోధ్యలో రామ మందిరం పూర్తి! మరి.. మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చింది?

అయోధ్య రామ మందిర నిర్మాణము వందల ఏళ్ళ హిందువుల కల. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఈరోజు అట్టహాసంగా ఆవిష్కరింపబడి.. అంత్యంత సుందరంగా ముస్తాబు అయింది అయోధ్య. దీని వెనుక జరిగిన కథ కథనాలు అన్నీ చరిత్ర పుటల్లో ఎప్పటికి నిలిచిపోతాయి. అవి మసీదుకు మందిరానికి మధ్య చెలరేగిన మంటలు. అయోధ్యలో ఏళ్ళ క్రితం నాటి రాముల వారి గుడిని కూల్చేసి.. కట్టిన బాబ్రీ మసీదును.. 1992లో రాముని స్థలంలో మసీదు కట్టారని హిందువులు కూల్చేశారు. అలా చెలరిగిన హింస ఎన్నో వివాదాల తర్వాత .. అదే స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాడనికి 2019లో సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలానే మసీదు నిర్మాణానికి కూడా స్థలం కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరగా.. యూపీ ప్రభుత్వం అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్లో.. 5 ఎకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించింది. అయితే, ఇప్పుడు రామ మందిరం పూర్తి అయింది. మరి, మసీదు నిర్మాణం ఎంత వరకు వచ్చింది అనే ప్రశ్న అందరికి మొదలైంది.

అయోధ్యలో మరి కొద్దీ గంటల్లో అనుకున్నట్లుగానే ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఇకపై అయోధ్యకు పూర్వ వైభవం రాబోతుంది. ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిరం నిర్మించాడనికి తీర్పు వెలువడిందో.. అదే రోజున మసీదు నిర్మించడానికి కూడా ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఆ తర్వాత యావత్ భారతీయుల సహాయ సహకారాలతో.. శరవేగంగా రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని.. నేడు వేడుకలు జరుపుకుంటుంది. కానీ, మసీదు నిర్మాణం కోసం కేటాయించిన స్థలం మాత్రం ఇంకా అలానే ఖాళీగా ఉంది. అక్కడ మసీదు నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వక్ఫ్ బోర్డును ఈ భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా .. అయోధ్య వివాదంలో ముస్లింల తరుపు పిటిషనర్ ఇక్బాల్ అన్సారీ తెలిపారు. కాబట్టి ఆ స్థలంలో మసీదు నిర్మించడం, నిర్మించకపోవడం ఆ బోర్డు ఇష్టమని చెప్పారు. అంతే కాకుండా దానిని ముస్లీంలు కూడా ప్రశ్నించరని అన్నారు. దానికి కారణం లేకపోలేదు.

సుప్రీం కోర్టు బాబ్రి మసీదుకు ప్రత్యామ్నాయంగా ఆ స్థలాన్ని కేటాయించే క్రమంలో.. రెండు నియమాలను ఉల్లఘించిందని తెలిపారు. అందులో మొదటిది వక్ఫ్ నియమాలు, రెండవది ఖురాన్ ఆధారిత షరియా నియమాలను ఉల్లంఘించినట్లు చెప్పారు. అయితే ఇందులో వక్ఫ్ నియమాల ప్రకారం మసీదులు, స్మశనాలు లాంటి వక్ఫ్ ఆస్తులను.. అమ్మకూడదు, తనఖా పెట్టకూడదు, గిఫ్ట్ ఇవ్వడం, ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వడం.. ఇలాంటివి చేయకూడదు. కానీ, సుప్రీం కోర్టు ఇలా నియమాలకు విరుద్ధంగా స్థలం కేటాయించడంతో..ముస్లింలు మసీదును నిర్మించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పారు.. . ఇండియన్ మిల్లీ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఖాలిక్ అహ్మద్ ఖాన్.

అలాగే, ఇండో ఇస్లామిక్ ఫౌండేషన్ సెక్రటరీ అథర్ హుసస్సేన్ సుప్రీం తీర్పుపై క్లారిటీ ఇచ్చారు. తమకు ఇచ్చిన బాబ్రీ మసీదుకు ప్రత్యామ్నాయం కాదని.. అథర్ హుసస్సేన్ స్పష్టం చేశారు. ఈ స్థలం కొత్త మసీదు నిర్మించుకునేందుకు ఇచ్చారని. సరిపడే నిధులు లేనందువలన మసీదు నిర్మాణం ఆలస్యమవుతోందని తెలిపారు. గతంలో దీనికోసం రూపొందించిన డిజైన్ కూడా మార్చి.. ఇక్కడ మసీదుతో పాటు హాస్పిటల్, మ్యూజియం కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక కొత్త డిజైన్ పూర్తికాగానే రెండు, మూడు నెలల్లో మసీదు నిర్మాణానికి ప్లాన్ చేస్తామని స్పష్టత ఇచ్చారు. ఇక.. ఈ మసీదు ఎప్పటికి పూర్తి అవుతుందో వేచి చూడాలి. మరి, అయోధ్యకు కొద్దీ దూరంలో ఉన్న ధన్నీపూర్లో.. మసీదు నిర్మాణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.