iDreamPost
android-app
ios-app

Rakhi 2024: రాఖీ పండుగ వేళ.. అన్నకు ప్రాణదానం చేసిన చెల్లెలు

  • Published Aug 19, 2024 | 1:51 PM Updated Updated Aug 19, 2024 | 1:51 PM

Rakhi 2024-Sister Donates Kidney To Brother: రాఖీ పండుగ వేళ.. ఓ చెల్లి అన్నకు ప్రాణదానం చేసింది. ఆమె చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఆ వివరాలు..

Rakhi 2024-Sister Donates Kidney To Brother: రాఖీ పండుగ వేళ.. ఓ చెల్లి అన్నకు ప్రాణదానం చేసింది. ఆమె చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఆ వివరాలు..

  • Published Aug 19, 2024 | 1:51 PMUpdated Aug 19, 2024 | 1:51 PM
Rakhi 2024: రాఖీ పండుగ వేళ.. అన్నకు ప్రాణదానం చేసిన చెల్లెలు

రాఖీ పండుగ అంటేనే సోదరీసోదరుల మధ్య బంధానికి ప్రతీకగా నిలిచే పర్వదినం. అన్నదమ్ముళ్ల బాగు కోరుతూ.. అక్కాచెల్లెళ్లు వారికి రాఖీ కడతారు. ఇక రక్ష కట్టించుకున్న సోదరులు.. తమ తోబుట్టువులకు ఎల్లవేళలా తోడుంటామని భరోసా కల్పిస్తారు. ఇక రాఖీ కట్టినందుకు గాను.. సోదరికి తోచిన బహుమతులు ఇస్తుంటారు. అయితే అక్కడక్కడా కొన్ని విభిన్నమైన, మనసుకు హత్తుకునే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. రాఖీ వేళ.. రక్ష కట్టినందుకు గాను.. సాధారణంగా సోదరులు.. తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తుంటారు. కానీ అప్పుడప్పుడు ఇందుకు భిన్నమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు మేం చెప్పబోయే ఘటన కూడా ఈ కోవకు చెందినదే. రక్షా బంధన్‌ వేళ.. ఓ చెల్లి అన్నకు ప్రాణదానం చేసింది. మనసుకు హత్తుకునే ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

రాఖీ పండుగ వేళ.. అన్నకు ప్రాణదానం చేసి.. అతడి కుటుంబాన్ని కాపాడింది ఓ చెల్లి. ఈ అరుదైన సంఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. రామ్‌గఢ్‌కు చెందిన ఓ సోదరి తన అన్నకు కిడ్నీ దానం చేసి.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న వీరిద్దరూ.. అక్కడే రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. రామ్‌గఢ్‌కు చెందిన దేవేంద్ర బుడానియా అనే వ్యక్తి సుమారు ఎనిమిదేళ్లుగా అనగా 2016 నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అతడికి దూరపు బంధువు ఒకరు కిడ్నీ దానం చేశాడు. దాంతో అతడు ఇన్నేళ్లు ఆరోగ్యంగానే ఉన్నాడు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అనగా ఈ ఏడాది కిడ్నీ పని చేయడం మానేసింది. దాంతో.. మరోసారి దేవేంద్రకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కిడ్నీ దాత కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో దేవేంద్ర సోదరి సునీతకు ఈ విషయం తెలిసింది. దాంతో తానే తన అన్నకు కిడ్నీ దానం చేయాలని భావించింది. వెంటనే ఈ విషయాన్ని తన అత్తారింట్లో, పుట్టింట్లో చెప్పి.. వారిని ఒప్పించి.. అన్న దేవేంద్రకు కిడ్నీ దానం చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దాంతో ఆస్పత్రిలోనే రాఖీ పండుగ జరుపుకున్నారు.

ఈ సందర్భంగా సునీత మీడియతో మాట్లాడుతూ.. ‘‘పెళ్లి తర్వాత ఆడపిల్లకు పుట్టింటితో సంబంధం ముగిసిపోతుందని కాదు. వివాహం తర్వాత నుంచే ఇంకా పెరుగుతుంది. పెళ్లి తర్వాత ఆడవారికి అటు పుట్టిల్లు.. ఇటు మెట్టినిల్లు.. ఇరువైపులా బాధ్యతలు పెరుగుతాయి. నేను నా అన్నకు కిడ్నీని దానం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. తన కుటుంబాన్ని నిలబెట్టానని భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సునీత, దేవేంద్రల ఆరోగ్యంగానే ఉన్నారని.. కోలుకున్న తర్వాత వీరిని డిశ్చార్జ్‌ చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా సునీత టీచర్‌గా పని చేకస్తోంది. ఇక రాఖీ పండుగ వేళ.. ఏకంగా అన్నకు ప్రాణ దానం చేసిన సునీతను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.