iDreamPost

PM Kisan: రైతులకు శుభవార్త.. PM కిసాన్ నిధి 8 వేలకు పెంపు.. కానీ!

  • Published Jun 09, 2024 | 12:36 PMUpdated Jun 09, 2024 | 12:36 PM

రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద అందించే నిధులను 6 వేల నుంచి 8 వేల రూపాయలకు పెంచింది. కాకపోతే ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. ఆ వివరాలు..

రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద అందించే నిధులను 6 వేల నుంచి 8 వేల రూపాయలకు పెంచింది. కాకపోతే ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. ఆ వివరాలు..

  • Published Jun 09, 2024 | 12:36 PMUpdated Jun 09, 2024 | 12:36 PM
PM Kisan: రైతులకు శుభవార్త.. PM కిసాన్ నిధి 8 వేలకు పెంపు.. కానీ!

సమాజంలోని బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకోవడం కోసం.. వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించి జీవితంలో పైకి ఎదగాలని భావించి.. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మరీ ముఖ్యంగా మహిళలు, రైతులను ఆదుకోవడం కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అన్నదాతల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకువచ్చాయి. దీనిలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం కిసాన్‌ యోజన కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుంది. ఈ పథకం కింద ప్రతి ఏటా రైతులకు మూడు విడతలుగా 6 వేల రూపాయలు సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీన్ని 8 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవడం కోసం పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద రైతులకు నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఇప్పటికే ఈ పథకం కింద 16 విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 32 వేలు జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో 17వ విడత డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఈ పథకం ద్వారా సాయం పొందాలంటే.. తప్పనిసరిగా ఇ కేవైసీ చేసుకోవాలి. అయితే పీఎం కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని 6 వేల రూపాయల నుంచి రూ.8 వేలకు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇది ఆచరణలోకి రానుంది. అయితే ఇది దేశవ్యాప్తంగా కాదు. కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే. ఇంతకు అది ఎక్కడ అంటే..

అన్నదాతలకు అందించే సాయానికి సంబంధించి రాజస్తాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే మొత్తాన్ని మరో రూ.2 వేలు పెంచింది. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ కీలక ప్రకటన చేశారు. దీంతో కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో 6 వేల రూపాయల బదులు రూ.8 వేలు జమ చేయనున్నారు. తాము ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తున్నామని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి తెలిపారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఒక్క రోజు ముందు రాజస్తాన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కాగా రాజసతాన్‌లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో కిసాన్‌ సమ్మాన్‌ పథకంతో పాటు.. ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా అన్నదాతల కోసం ఆర్థిక సాయం అందించే పథకాలను ప్రారంభించి.. నగదును ఖాతాల్లో జమ చేస్తున్నాయి. మరి దేశవ్యాప్తంగా కిసాన్‌ సమ్మాన్‌ నిధులను పెంచుతారా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి