P Krishna
Puri Jagannath Temple: భారత దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయంలోని రగ్నభాంగారం రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత గురువారం తెరిచిన విషయం తెలిసిందే. రహస్య గదిలో విలువైన సంపద తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు.
Puri Jagannath Temple: భారత దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయంలోని రగ్నభాంగారం రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత గురువారం తెరిచిన విషయం తెలిసిందే. రహస్య గదిలో విలువైన సంపద తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు.
P Krishna
దేశంలోని కోట్ల మంది భక్తులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన పూరీ జగన్నాథుని రత్న భాండాగారం రహస్య గది తలుపులు గురువారం తెరిచారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ గది తలుపులు తెరవడంపై అందరి దృష్టి భాండాగారంలోని సంపదపై పడింది. గదిలో భారీ పెట్టెలు, అల్మారాల్లో ఉన్న స్వామివారి ఆభరణాలను తాత్కాలికంగా స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ బిశ్వానాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం 9.51 గంటలకు రహస్య గది తాళం తీసిన విషయం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.గది తాళాలు తెరుస్తుండగా అనుకోని సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలో సొరంగాలు, రహస్య మార్గాలు ఉన్నాయా అని పూరి గజపతి మహరాజాను అడిగిన ప్రశ్నకు.. ఏఎస్ఐ పరిశీలన అనంతరం పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని, క్షుణ్ణంగా పరిశీలించేందుకు లేజర్ స్కానింగ్ కూడా వినియోగించబోతున్నారని తెలిపారు. ముందు జాగ్రత చర్యలగా లోపట ఓడ్రాఫ్ జవానులను, స్నేక్ హెల్ప్ వైన్లు సిద్దంగా ఉంచినట్లు తెలిపారు. గ్యాస్ కట్టర్లు, హైమాస్ట్ దీపాలు, ఆక్సీజన్ సిలిండర్లను తీసుకువెళ్లినా అక్కడ వాటితో అవసరం ఉందని ఓ అధికారి తెలిపారు. రహస్య గదిలో ఉన్న విలువైన సంపద, ఆభరణాలను లెక్క గట్టే ప్రక్రియ 30 నుంచి 40 రోజుల్లో పూర్తి చేస్తామని ఒడిశా న్యాయ శాఖ మంత్రి వృథ్విరాజ్ హరిచందన్ తెలిపారు. 1978 లో ఈ భాండాగర సంపదను లెక్కపెట్టడానికి 70 రోజులు పట్టినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. రత్న భాండాగారం లోపల గది తాళం తెరిచే సమయానికి అనుకోకుండా భారీ వర్షం పడటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది గొప్ప శుభసూచికం అని భావించారు. రహస్య గదిలో పెద్ద పరిమాణంలో 3 పెట్టెలు ఉన్నాయి.. వాటిలో రెండు కలప, ఒకటిస్టీల్ తో చేైసినవి, అలాగే 4 భారీ సైజు అల్మారాలు ఉన్నాయి. వాటిలో మూడు కలపతో, ఒకటి స్టీల్ తో చేసినవి. ఈ అల్మారాల్లో చిన్న కంటైనర్ తరహా పెట్టలో స్వామి వారి ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. వీటిని పురావస్తు శాఖ (ఏఎస్ఐ) భాండాగారం మరమ్మతులన చేపడుతుందని.. భాండాగారం సంపద పూర్తయ్యాక, అధ్యయన సంఘం మరోసారి సమావేశమైన రహస్య గదులను శోధంచడంపై గవర్నమెంట్ కి సిఫార్సు చేస్తుందని జిస్టస్ బిశ్వనాథ్ రథ్ వివరించారు.