iDreamPost
android-app
ios-app

పెళ్లి వేడుకలో రాధికా మర్చంట్ స్పీచ్.. హాలీవుడ్ మూవీ సీన్ కాపీ!

  • Published Mar 08, 2024 | 4:21 PM Updated Updated Mar 08, 2024 | 4:21 PM

పెళ్లి వేడుకలో అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్ స్పీచ్ ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఆమె స్పీచ్ కి అనంత్ అంబానీ, ఆయన కుటుంబం సహా వోల్ ఇండియా వావ్ అనుకున్నారు. కానీ ఆమె స్పీచ్ ఒక హాలీవుడ్ మూవీలోంచి కాపీ కొట్టారని తెలిశాక అట్లుంటది మా రాధికాతోటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకే ఆ మూవీ ఏంటంటే?

పెళ్లి వేడుకలో అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్ స్పీచ్ ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఆమె స్పీచ్ కి అనంత్ అంబానీ, ఆయన కుటుంబం సహా వోల్ ఇండియా వావ్ అనుకున్నారు. కానీ ఆమె స్పీచ్ ఒక హాలీవుడ్ మూవీలోంచి కాపీ కొట్టారని తెలిశాక అట్లుంటది మా రాధికాతోటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకే ఆ మూవీ ఏంటంటే?

  • Published Mar 08, 2024 | 4:21 PMUpdated Mar 08, 2024 | 4:21 PM
పెళ్లి వేడుకలో రాధికా మర్చంట్ స్పీచ్.. హాలీవుడ్ మూవీ సీన్ కాపీ!

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న బడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక సౌత్ నుంచి రామ్ చరణ్, ఉపాసన, రజినీకాంత్ హాజరయ్యారు. కాగా వేడుకలో అనంత్ అంబానీ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ధనవంతుడిగా పుట్టినప్పటికీ చాలా కష్టాలు అనుభవించానని అన్నారు. అనారోగ్యం తనను వెంటాడిందని.. ఆ సమయంలో తన తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు. కొడుకు మాటలకు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అపర కుబేరుడికైనా కన్నీళ్లు తప్పలేదు.

తల్లిదండ్రులే కాకుండా తన చిన్న నాటి స్నేహితురాలైన రాధికా మర్చంట్ కూడా తననెంతగానో ప్రోత్సహించారని అనంత్ అంబానీ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో రాధికా మర్చంట్ కూడా అనంత్ అంబానీ గురించి మాట్లాడారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలో వీరిద్దరి స్పీచ్ ఆకట్టుకుంది. అయితే రాధికా మర్చంట్ కాబోయే భర్త అనంత్ అంబానీ గురించి మాట్లాడిన మాటలు హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ హాలీవుడ్ మూవీ సీన్ ని, రాధికా స్పీచ్ ని కలిపి ఒక ఎడిట్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగిన మరుసటి రోజు ఆమె మాట్లాడిన మాటలు.. 2004లో వచ్చిన హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారని ట్రోల్ చేస్తున్నారు. 2004లో వచ్చిన ‘షెల్ వియ్ డ్యాన్స్’ అనే సినిమాలో సుసాన్ సారండన్ మాట్లాడిన మాటలకు.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రాధికా మాట్లాడిన మాటలకు పోలికలు ఉండడంతో ఆ మూవీ క్లిప్ ని నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. 

మామూలుగా స్పీచ్ లివ్వడానికి కొంతమంది స్క్రిప్ట్ పేపర్ దగ్గర పెట్టుకుంటారు. తాము మాట్లాడాల్సిన మాటలు ముందుగానే రాసుకుని వస్తారు. కొంతమంది ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. కొంతమంది ప్రిపేర్ అయ్యి వస్తారు. ప్రిపేర్ అయి వచ్చిన వారిలో రాధికా మర్చంట్ ఒకరు. మరి ఆమెకు ఆ హాలీవుడ్ మూవీలో ఆ సీన్ చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో తెలియదు గానీ ఆ సీన్ లో నటి సుసాన్ మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. ఆ మాటలను ఆమె మాటలుగా అనంత్ అంబానీకి అప్లై చేశారు.

దీంతో అనంత్ అంబానీతో పాటు చాలా మంది రాధికా మర్చంట్ ది కవి హృదయం అని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు ఒక ఔత్సాహికుడు అది ఓన్ కాదు లోన్ మాటలు అని ఒక వీడియో షేర్ చేశాడు. ఆ వీడియో చూస్తే.. ఆమె మాట్లాడిన మాటలు, మూవీలో సుసాన్ మాట్లాడిన మాటలు ఒకేలా ఉన్నాయి. దీంతో ఎగ్జామ్ లో కాపీ కొట్టినట్టు రాధికా కూడా కాపీ కొట్టారంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం సక్సెస్ కాని వారే ఇలా సక్సెస్ అయిన వారిలో లోపాలను ఎత్తి చూపిస్తూ కూర్చుంటారని కామెంట్స్ చేస్తున్నారు. మరి వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by FlixZon (@flixzonofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom