iDreamPost
android-app
ios-app

కస్టమర్లకు షాక్‌ ఇచ్చిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌!

కస్టమర్లకు షాక్‌ ఇచ్చిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌!

ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కస్టమర్లకు షాక్‌ ఇచ్చింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్స్‌(MCLR)పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కొత్త వడ్డీరేట్లు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పెంచిన వడ్డీ రేట్లను చూసుకున్నట్లయితే.. నెల వారి రుణాలపై వడ్డీరేటు 8.20 నుంచి 8.25 శాతం పెంచింది.

6 నెలల టైం స్పాన్‌ ఉన్న రుణాలపై వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెంచింది. సంవత్సర కాల పరిమితి ఉన్న రుణాలపై వడ్డీ రేట్లను 8.60 శాతం నుంచి 8.65కు పెంచింది. కాగా, ఎమ్‌సీఎల్‌ఆర్‌ 2016 ఏప్రిల్‌ నెలలో అమల్లోకి తీసుకువచ్చారు. ఈ ఎమ్‌సీఎల్‌ఆర్‌లను పెంచడం ద్వారా హోమ్‌ లోన్స్‌, ఆటో లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌ తీసుకున్న వారిపై భారం పడనుంది. ఎమ్‌ఎసీఎల్‌ఆర్‌ పెరగటం ద్వారా నెల వారి ఈఎమ్‌ఐలు ప్రియం కానున్నాయి.

ఎమ్‌సీఎల్‌ఆర్‌లపై ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌!

  • ఎమ్‌సీఎల్‌ఆర్‌ల ద్వారా స్థిర హోల్‌లోన్‌ రేట్లు ప్రభావితం కాకూడదు.
  • మార్జినల్‌ కాస్ట్‌ ఫండ్స్‌ గురించిన లెక్కలు చేసేటప్పుడు డిపాజిట్‌ బ్యాలెన్స్‌, ఇతర రుణాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి.
  • ఎమ్‌ఎసీఎల్‌ఆర్‌లకు సంబంధించి హోమ్‌లోన్‌ రుణం మంజూరు చేసిన నాటినుంచి రీసెట్‌ డేట్‌ వరకు ఒకే విధంగా ఉండాలి.

మరి, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్స్‌ పెంచుతూ నిర్ణయం తీసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.