iDreamPost
android-app
ios-app

లాటరీ కొని.. కోట్లు గెల్చుకున్న రైతు!

  • Published Nov 08, 2023 | 5:03 PM Updated Updated Nov 08, 2023 | 5:03 PM

సమాజంలో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అందుకోసం మధ్యతరగతి కుటుంబీకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఎక్కువగా లాటరీలు కొనుగోలు చేస్తుంటారు.

సమాజంలో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అందుకోసం మధ్యతరగతి కుటుంబీకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఎక్కువగా లాటరీలు కొనుగోలు చేస్తుంటారు.

లాటరీ కొని.. కోట్లు గెల్చుకున్న రైతు!

సాధారణంగా డబ్బు సంపాదించడానికి చాలా మంది చాలా రకాల మార్గాలు ఎన్నుకుంటారు. సొసైటీలో ప్రతి ఒక్కరూ గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. సామాన్యులు కోట్లు సంపాదించడం అంటే కల.. అందుకోసం అహర్శిలూ కష్టపడాలి. అదృష్టం కలిసి వస్తే ఎవరో ఒకరు తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒకేసారి డబ్బు కలిసి రావాలి.. లక్షలు, కోట్లకు పడగెత్తాలని భావించేవారు తమ అదృష్టాన్ని పరీక్షించునేందుకు లాటరీ కొనుగోలు చేస్తుంటారు. అదృష్టం ఒక్కసారైనా కలిసి రాదా అని లాటరీలు కొనుగోలు చేసి ఆస్తులు అమ్ముకున్న వాళ్లు కూడా ఉన్నారు. లక్షల్లో కొద్ది మందికి మాత్రమే అదృష్ట లక్ష్మి లాటరీ రూపంలో కలిసి వస్తుంది. లాటరీతో జాక్ పాట్ కొట్టిన వాళ్లు రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరుల అవుతుంటారు. ఓ రైతు టైంపాస్ కి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.. గంటల వ్యవధిలోనే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

సామాన్య ప్రజలు తమ ఆర్థిక కష్టాలు తొలగించుకోవడం కోసం లాటరీ పై ఆధారపడుతుంటారు. ఒక్కసారి లాటరీలో జాక్ పాట్ కొడితే కోటీశ్వరులు కావొచ్చన్న ఆశ ఉంటుంది. కోట్లాది మంది ఆశావాహులు లాటరీ కొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారైనా కలిసి రాకపోతుందా.. తమ బతుకులు మారకపోతాయా అనుకుంటూ ఏళ్ల తరబడి లాటరీలు కొంటూనే ఉంటారు. ఎవరి భవితవ్యం ఎప్పుడు మారుతుందో ఎవరూ చెప్పలేరు.. అదృష్ట లక్ష్మి ఎప్పుడు లాటరీ రూపంలో కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. అలా జాక్ పాట్ కొట్టిన వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతుంటారు. తాజాగా పంజాబ్ లోని ఓ రైతు జాక్ పాట్ కొట్టాడు. హుషియార్ పూర్ కు చెందిన శీతల్ సింగ్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మెడికల్ షాప్ కి వెళ్లి మందులు కొనుగోలు చేశాడు. మందులు కొన్న తర్వాత పక్కనే ఉన్న ఓ టీ షాప్ వద్దకు వెళ్లాడు. అక్కడ లాటరీ షాప్ చూసి టైం పాస్ కి ఒక లాటరీ కొని జేబులో పెట్టుకొని వెళ్లాడు.

శీతల్ ఇంటికి వెళ్లిన కొద్ది గంటల తర్వాత అతనికి లాటరీ నిర్వాహకులు ఫోన్ చేశారు. మీకు లాటరీ తగిలింది, రెండున్న కోట్ల రూపాలు గెల్చుకున్నారు అని చెప్పడంతో మొదట అది ఫెక్ కాలని భావించాడు. అయితే లాటరీ యాజమాన్యం శీతల్ నెంబర్ ని కన్ఫామ్ చేసి చెప్పడంతో శీతల్ తో పాటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సామాన్యమైన రైతు కుటుంబానికి చెందిన శీతల్ అప్పటి వరకు బీదరికంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. శీతల్ ఒక్కసారే కోటీశ్వరుడు కావడంలో చుట్టు పక్కల వాళ్లు కూడా సంతోషాన్ని ప్రకటించారు. అయితే లాటరీలో వచ్చిన డబ్బు ఏం చేస్తావని కొంతమంది అడిగారు..  ప్రస్తుతం తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏదైనా ఒక మంచి పనికి ఉపయోగిస్తానని అన్నారు శీతల్. ఈ వార్త చుట్టు పక్కట గ్రామాల్లో హల్ చల్ చేస్తుంది.