iDreamPost
android-app
ios-app

ట్రైయినీ IAS పూజా ఖేడ్కర్ ఇంటిపైకి బుల్డోజర్! ఎందుకంటే..?

Pooja Khedkar Issue: తప్పు చేస్తే చట్టం నుంచి ఎలాంటి వారైనా తప్పించుకోలేరు అన్న సంగతి తెలిసిందే. ట్రైనీ ఐఏఎస్ గా ఉంటూ భూ దందాలకు పాల్పపడిన పూజా ఖేడ్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.

Pooja Khedkar Issue: తప్పు చేస్తే చట్టం నుంచి ఎలాంటి వారైనా తప్పించుకోలేరు అన్న సంగతి తెలిసిందే. ట్రైనీ ఐఏఎస్ గా ఉంటూ భూ దందాలకు పాల్పపడిన పూజా ఖేడ్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.

ట్రైయినీ IAS పూజా ఖేడ్కర్ ఇంటిపైకి బుల్డోజర్!  ఎందుకంటే..?

మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కేసులో రోజుకో ట్విస్ట్ జరుగుతుంది.ట్రైనీ ఐఏఎస్ గా ఉంటూ ప్రజలకు సేవ చేయాల్సింది పోయి భూ ఆక్రమణలకు పాల్పపడిన ఆమెపై ప్రభుత్వం చర్యలకు దిగింది. తాజాగా పూజా ఖేడ్కర్ కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పూణేలో బ్యూరోక్రాట్ గా పదవీ దుర్వినియోగం చేయడం, పలు భూ అక్రమణలకు పాల్పపడటం, ఇతర డిమాండ్లతో కొద్దిరోజులుగా వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఖేడ్కర్ కి పుణె మున్సిపల్ కార్పొరేషన్ మరో షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. పూణేలో బ్యూరోక్రాట్ పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర భూ దందాలకు పాల్పపడటం వంటి ఆరోపణలపై ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ చిక్కుల్లో పడ్డారు. ఆమె తన ప్రైవేట్ ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర గవర్నమెంట్ వీఐపీ స్టిక్కర్, వీఐపీ నెంబర్ ప్లేటు అనుమతి లేకుండా వాడటం, తన దివ్యాంగ ధృవీకరణకు చెందిన పత్రాల్లో అవకతవకలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది. తాజాగా ఆమె కుటుంబ నివాసానికి ఆసుకుని ఉన్న అక్రమ నిర్మాణాలను పీఎంసీ కూల్చి వేసింది. అక్రమ నిర్మాణానికి సంబంధించి ముందస్తు నోటీసులు ఇచ్చినా ఆమె కుటుంబం పట్టించుకోకపోవడంతోనే కూల్చివేసినట్లు తెలుస్తోంది.

పూణేలో ఉంటున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కుటుంబానికి పూణే మున్సిపల్ కార్పోరేషన్ షాక్ ఇచ్చింది. ఆమె ఇంటికి ఆనుకుని ఉన్న నిర్మాణాలను బల్డోజర్ తో కూల్చి వేసింది. గతంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి పీఎంసీ ఖేడ్కర్ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా వాటిని పట్టించుకోలేదని.. ఎలాంటి స్పందన రాకపోవడంతో బుల్డోజర్ తో అధికారలు వెళ్లి దగ్గరుండి మరీ కూల్చివేయించారు. ఇదిలా ఉంటే.. ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి