nagidream
నచ్చని జాబు చాలా మంది చేస్తారు. కానీ నచ్చలేదని చెప్పి వదిలేసేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి. సినిమాని మించిన సీన్ ఇది. ఇతను చేసిన పని తెలిస్తే విజిల్స్ వేస్తారు.
నచ్చని జాబు చాలా మంది చేస్తారు. కానీ నచ్చలేదని చెప్పి వదిలేసేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి. సినిమాని మించిన సీన్ ఇది. ఇతను చేసిన పని తెలిస్తే విజిల్స్ వేస్తారు.
nagidream
జాబ్ ఇది దొరక్క చాలా మంది నచ్చని పనులు చేస్తున్నారు. నచ్చే జాబ్ వచ్చేవరకూ నచ్చకపోయినా సర్దుకుపోతున్నారు. కుటుంబ కష్టాలు ఉంటే జాబ్ ఎంత ఒత్తిడి పెట్టినా.. ఆఫీసు వాళ్ళు ఆ పనిని గుర్తించినా, గుర్తించకున్నా ఇంకా కుటుంబం కోసం అడ్జస్ట్ అయి ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. రోజూ లోపల ఒక రకమైన సంఘర్షణకు లోనవుతారు. బాస్ తోనో లేక తోటి ఉద్యోగితోనో, తన టీమ్ లీడర్ తోనో ఈగో క్లాషెస్ రావడం.. సీరియస్ గా పాన్ డబ్బా దగ్గరకి పోయి జాబ్ మానేస్తా అనుకోవడం.. ఏ బ్యాంకు నుంచో ఈఎంఐ కట్టాలి అని ఫోన్ రావడం.. అంతే జాబ్ మానకూడదు అని డిసైడ్ అవ్వడం.. ఇదే ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్న అంశం. నచ్చని జాబ్ మానేయాలంటే గట్స్ ఉండాలి. ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్, ఈఎంఐలు ఇలా సరదా తీర్చేసే ఖర్చులు చాలా ఉన్నాయి. ఈ ఖర్చులన్నిటికీ డబ్బులు కావాలా? అయితే మూసుకుని పని చెయ్.. ఆత్మాభిమానం నిలబడాలా? అయితే బయటకొచ్చేయ్ అని రోజూ తనలో తాను, తనతో తాను యుద్ధం చేసే మనుషులున్నారు ఈ సమాజం ఆఫ్ ఇండియాలో.
జాబ్ పోతే అమ్మబాబోయ్ జీవితం పోయిందని బాధపడేవారున్నారు. అలాంటిది ఒక వ్యక్తి జాబ్ పోతే పోతే పోయింది పౌడర్ డబ్బాలో జాబ్.. అని పండగలా సెలబ్రేట్ చేసుకున్నాడు. అతని పేరు అనికేత్ ఓ కంపెనీలో సేల్స్ అసోసియేట్ గా పని చేస్తున్నాడు. పూణేలో పెరిగాడు. ఇతను చేసిన పనికి ఇప్పుడు ఇతను దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు. జాబ్ వదిలేసినందుకు పండగలా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇతను చేసే పనికి తగిన జీతం, గుర్తింపు రావడం లేదని జాబ్ మానేయాలని నిర్ణయించుకున్నాడు. బ్యాండు మేళం సెట్ చేసి మేనేజర్ ని పిలిచి అతని ముందే డ్యాన్స్ చేస్తూ జాబ్ కి రిజైన్ చేశాడు. తాను వెళ్తున్నట్టు మేనేజర్ చూడాలని అలా చేశాడు.
పని చేసే రోజు అదే ఆఖరి రోజు కావడంతో బ్యాండు మేళం పెట్టి.. ఆ డప్పుల సౌండ్ కి డ్యాన్స్ చేస్తూ పండగలా సెలబ్రేట్ చేసుకున్నాడు. అది చూసి బాస్ కి ఈగో హర్ట్ అయ్యింది. ఏమీ చేయలేని పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అనికేత్ ఎందుకు జాబ్ మానేస్తున్నాడో.. అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. జాబ్ లో జాయిన్ అయ్యాక మూడేళ్ళుగా జీతంలో ఎలాంటి మార్పూ లేదని.. బాస్ నుంచి అయితే ఎలాంటి గౌరవం అందడం లేదని.. అందుకే జాబ్ ని ఇలా వైవిధ్యంగా వదిలేశానని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ చాలా సంతృప్తిగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు మగాడివిరా బుజ్జి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యూచర్ ఏంటో ఆలోచించకుండా ఆత్మగౌరవం కోసం జాబ్ మానేసిన అనికేత్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.