iDreamPost
android-app
ios-app

లేడీ యూట్యూబర్ కి లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్!

  • Published Dec 20, 2023 | 11:26 AM Updated Updated Dec 20, 2023 | 11:26 AM

ఇటీవల దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఆడవాళ్లు కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపో ప్రవర్తిస్తున్నారు.. లైంగిక వేధింపులు, అత్యాచారాలకు తెగబడుతున్నారు.

ఇటీవల దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఆడవాళ్లు కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపో ప్రవర్తిస్తున్నారు.. లైంగిక వేధింపులు, అత్యాచారాలకు తెగబడుతున్నారు.

  • Published Dec 20, 2023 | 11:26 AMUpdated Dec 20, 2023 | 11:26 AM
లేడీ యూట్యూబర్ కి లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్!

దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న వయసు నుంచి వృద్ద మహిళల వరకు కామంధులు ఎవరినీ వదలడం లేదు. నిర్బయ, దిశా లాంటి చట్టాలు వచ్చినా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పట్టపగలు ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కొంతమంది దుండగులు విదేశీ పర్యటకులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ విదేశీ యూట్యూబర్ ని ఆకతాయి లైంగికంగా వేధించాడు.. ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.

కొంతమంది ఆకతాయిలు భారత దేశానికి వచ్చిన విదేశీ మహిళలను, యూట్యూబర్లను టార్గెట్ చేసుకొని వేధించడం, డబ్బులు వసూళ్లు చేయడం లాంటివి చేయడంతో దేశం పరువు పోతుందని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి.  తాాజాగా సౌత్‌ కొరియా లేడీ యూట్యూబర్‌ను వేధించిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. వీడియోలో కొరియన్ వాగ్లర్ కెల్లీ పుణేలో ఓ మార్కెట్ లో కొబ్బరిబోండం తాగుతూ వ్యక్తితో ముచ్చటిస్తుంది. అంతలోనే ఓ అకతాయి అక్కడికి వచ్చి ఆమెపై చేయి వేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధించాడు. ఈ ఘటన దీపావళి పండుగకు నాలుగు రోజుల ముందు జరిగినట్లు తెలుస్తుంది.

యూట్యూబర్ ని వేధిస్తున్న సమయంలో ఆమె అతన్ని విధిలించుకొని వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది. అయినా కూడా ఆమెను ఆ వ్యక్తి వదలకుండా మీద చేతులు వేయడం ప్రారంభించాడు. అంతలో అక్కడికి మరో యువకుడు రావడంతో అతన్ని కూడా తనకు సాయం చేయాలని సైగ చేశాడు. దీంతో కెల్లీ వారి నుంచి మెల్లిగా విడిపించుకునే ప్రత్నం చేసింది. నేను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి.. వాళ్లు నన్ను కౌగిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అని కెల్లి అనడం వీడియోలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నింధితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే రావట్ ప్రాంతానికి చెందిన భరత్ కరణ్ రావ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి తరహా ఘటన గతంలో ముంబైలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.