12th ఫెయిల్ సినిమాను తలపించేలా.. అప్పుడు ఇంటర్‌లో ఫెయిలై.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్‌గా

ప్రణాళికాబద్దంగా కష్టపడితే విజయాాలు సాధించడం కష్టమేమీకాదని నిరూపించింది ప్రియా యాదవ్. ఇంటర్ లో ఫెయిలైనా కుంగిపోకుండా మరింత కసితో చదివి నేడు నేడు డిప్యూటీ కలెక్టర్ పోస్టును సాధించింది.

ప్రణాళికాబద్దంగా కష్టపడితే విజయాాలు సాధించడం కష్టమేమీకాదని నిరూపించింది ప్రియా యాదవ్. ఇంటర్ లో ఫెయిలైనా కుంగిపోకుండా మరింత కసితో చదివి నేడు నేడు డిప్యూటీ కలెక్టర్ పోస్టును సాధించింది.

కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడితేనే ఫలితం దక్కుతుందని నిరూపిస్తున్నారు నేటి యువత. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందన్న వ్యాఖ్యలను నిజం చేస్తున్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు పేదరికం అడ్డుకాదని రుజువు చేస్తున్నారు. లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అంకితభావంతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించొచ్చు. ఇదే రీతిలో ఓ యువతి సక్సెస్ సాధించింది. రైతు కుటుంబానికి చెందిన ఆమె చదువుల్లో చురుకుగా ఉండేది. కానీ ఇంటర్ లో ఫెయిల్ అయ్యింది. అయితేనేం ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైంది. ఆమె మరెవరో కాదు. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రియా యాదవ్. ఎంతో మందికి ఆదర్శం ఈమె.

మీరంతా 12 ఫెయిల్ మూవీ చూసే ఉంటారు. ఆ సినిమాలో హీరో ఇంటర్ లో ఫెయిల్ అవుతాడు. 12వ తరగతిలో తప్పిన ఆయన ఎంతో కష్టపడి దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షను నెగ్గి ఐపీఎస్ అవుతాడు. అయితే ఇలాంటి సినిమాను తలపించే స్టోరీనే ప్రియా యాదవ్ ది. ఆమె కూడా 11వ తరగతిలో ఫెయిల్ అయి వైఫల్యాన్నే విజయంగా మార్చుకుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ దాటుకుని నేడు సమాజం గర్వించే స్థాయిలో డిప్యూటీ కలెక్టర్ పోస్టును సాధించింది. అయితే ప్రియా యాదవ్ టెన్త్ క్లాస్ లో టాపర్. ఆ తర్వాత బంధువుల ఒత్తిడి మేరకు తనకు ఇష్టం లేకున్నా ఇంటర్ లో సైన్స్‌ సబ్జెక్టు చదివి ఫిజిక్స్‌లో ఫెయిల్‌ అయ్యింది. ఆమెకు జీవితంలో ఇదే మొదటి, చివరి వైఫల్యం. కానీ ఆ తర్వాత కష్టపడి చదివి ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎంపీపీఎస్‌సీ) పరీక్షలో ఆమె ఆరో ర్యాంకు సాధించింది.

త్వరలో డిప్యూటీ కలెక్టర్‌ కానుంది ప్రియా యాదవ్‌. అయితే ఇక్కడ ఆమె మరో ఘనత ఏంటంటే.. ప్రియా యాదవ్ ఇప్పటికే ప్రభుత్వ శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నది. సరైన ప్రణాళికతో చదివితే విజయం తప్పక వరిస్తుందని ప్రియా యాదవ్ మరోసారి చాటిచెప్పింది. రాష్ట్రంలోని హర్దా జిల్లాకు చెందిన ప్రియా యాదవ్ తన తండ్రి వ్యవసాయం చేస్తుంటారని, తల్లి గృహిణి అని చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. ‘నేను గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిని అని, ఆడపిల్లలకు చాలా తొందరగా పెళ్లిళ్లు చేస్తారు, కానీ మా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాలేదని, చదువుకోవడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు’ అని ఆమె చెప్పింది. రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తూనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షకు సిద్ధం అవుతానని ఆమె అన్నారు.

Show comments