iDreamPost
android-app
ios-app

రూ.500 నోటుపై రాముడి బొమ్మ ముద్రించండి! మోదీకి రాజాసింగ్ విజ్ఞప్తి!

  • Published Jan 20, 2024 | 8:18 PM Updated Updated Jan 20, 2024 | 10:25 PM

యావత్‌ భారతదేశం ఆ శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఇంతటి ఆద్భుతమైన ఘట్టన్నీ ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. అయితే ఇప్పటికే అయోధ్య రామ మందిరానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఆ కోదండ రాముని విషయంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు. అదేమిటంటే..

యావత్‌ భారతదేశం ఆ శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఇంతటి ఆద్భుతమైన ఘట్టన్నీ ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. అయితే ఇప్పటికే అయోధ్య రామ మందిరానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఆ కోదండ రాముని విషయంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు. అదేమిటంటే..

  • Published Jan 20, 2024 | 8:18 PMUpdated Jan 20, 2024 | 10:25 PM
రూ.500 నోటుపై రాముడి బొమ్మ ముద్రించండి! మోదీకి రాజాసింగ్ విజ్ఞప్తి!

ఇప్పటికే అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయ్యింది. అంతేకాకుండా అయోధ్యలో కొలువుదీరనున్న కోదండ రాముని దర్శనం కోసం రామ భక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. యావత్‌ భారతదేశం ఆ శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఇంతటి ఆద్భుతమైన ఘట్టం ఈనెల 22న జరగనుంది. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అయోధ్య రామ మందిరానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఇటీవలే అయోధ్యలోని రామ మందిర మహా సంప్రోక్షణకు ముందు, శ్రీ రాముడి చిత్రంతో కూడిన రూ.500 నోటు చిత్రం ఇంటర్నెట్‌లో దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇందులో ఎటువంటి వాస్తవం లేకపోయినా దీనిని నిజం చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

కొన్ని సందర్భాల్లో ప్రత్యేక నాణెలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేయడం సర్వ సాధారణం, అలాగే కొందరు మహనీయులను గుర్తు చేసుకుంటూ కూడా కాయిన్స్ ను విడుదల చేస్తుంటారు. ఇటీవలే సీనియర్ ఎన్టీఆర్ పై వచ్చిన వంద రూపాయల నాణెం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇప్పుడు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. రూ.500 నోటు పై రాముని చిత్రం ముద్రించినట్లు చాలా వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే వాటిలో ఎంత వరకు నిజం లేదని తేలిపోయింది. అయితే ఇప్పుడు దీనిని వాస్తవం చేయాలని గోషామహల్ ఎమ్మేల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

మహారాష్ట్రలో పర్యటిస్తున్న ఆయన ఓ సభలో పాల్గొని మాట్లాడుతూ.. రూ. 500 వందల నోటుపై శ్రీరాముని చిత్రాన్ని ముద్రించాలని ప్రధాని మోడీకి ప్రత్యేక విజ్ఞప్తిని తెలియజేశారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కరన్సీ నోట్లపై హిందూ దేవుళ్ల ఫోటోలను ముద్రించారని చెప్పారు. అలాగే దేశంలో వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములను రిలీజ్ చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ విభజన సమయంలో భారత్ ను విడిచి వెళ్లనవారి ఆస్తులను కాపాడేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ వక్ఫ్ చట్టం తెచ్చారని ఆరోపించారు. ఒక్క మహారాష్ట్రలోనే బోర్డు పేరుతో 10 లక్షల భూములు ఉన్నాయని వాటిని మహారాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మరి, రూ.500 నోటు పై రాముడి చిత్రం ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న రాజాసింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.