iDreamPost
android-app
ios-app

అయోధ్య నిర్మాణ కార్మికులను సత్కరించిన ప్రధాని మోడీ!

అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట వేడుక పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోడీ. మొత్తం వేడుకను తన చేతులపై నడిపించారు ఆయన. అనంతరం భావోద్వేగ పూరిత సందేశాన్ని అందించారు.

అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట వేడుక పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోడీ. మొత్తం వేడుకను తన చేతులపై నడిపించారు ఆయన. అనంతరం భావోద్వేగ పూరిత సందేశాన్ని అందించారు.

అయోధ్య నిర్మాణ కార్మికులను  సత్కరించిన ప్రధాని మోడీ!

ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్మాత్మిక నగరి అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తి చేసుకుంది. నిండైన రూపంతో బాల రాముడు గర్భ గుడిలో కొలువు దీరాడు. ఈ వేడుక చాలా అట్ట హాసంగా జరిగింది. దేశ ప్రధాన మంత్రి చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది. విగ్రహ రూపంలో శ్రీరామునికి తన ఇంటికి చేరుకోవడానికి 5 శతాబ్దాలు పట్టింది. 51 ఇంచుల రామ్ లుల్లా ఇప్పుడు అయోధ్యలోని నాగర్ శైలిలో నిర్మించిన దేవాలయంలో పూజలు అందుకుంటుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకను భారత్ పండుగలా చేసుకుంది. ప్రాణ ప్రతిష్ట తర్వాత ప్రధాన మంత్రి 7 వేల మంది అతిరథ మహారథులు, భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఎన్నో పోరాటాలు, త్యాగాలు, బలిదానాల తర్వాత మన రాముడు తిరిగి అయోధ్యకు వచ్చాడంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు ప్రధాని. రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, కానీ చివరకు న్యాయమే గెలిచిందంటూ.. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రసంగం అనంతరం మరికొన్ని ప్రత్యేకమైన పూజలు చేసిన ఆయన అయోధ్య నిర్మాణానికి పాటుపడ్డ శ్రామికుల్ని సన్మానించారు. అయోధ్య ఆలయ నిర్మాణంలో చెమట చిందించిన కార్మికులపై ఆయన పూల వర్షం కురిపించారు. వారికి గుడి ప్రాంగణంలో ఈ అరుదైన అవకాశం దక్కింది. సంప్రదాయ దుస్తులు ధరించిన ఆయన.. ఓ చేతిలో పూలతో ఉన్న బుట్టను పట్టుకుని శ్రామికులపై పువ్వులు జల్లుతూ సత్కరించారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీనితో పాటు ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి ప్రధాని మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం విశేష కృషి చేయడమే కాకుండా.. ప్రాణ ప్రతిష్ట కోసం అత్యంత నియమ నిబంధనలతో కఠిన ఉపవాస దీక్ష చేపట్టారు. 22 పవిత్రమైన తీర్ధాల్లో స్నానం చేశారు. అనేక దేవాలయాలను సందర్శించారు. మొత్తానికి హిందువుల కలను నెరవేర్చిన ప్రధానిగా పేరుగాంచారు మోడీ. ఎడతెరిపి లేకుండా ఆధ్మాత్మిక పర్యటన చేయడమే కాకుండా.. అయోధ్య రామాలయ నిర్మాణ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తన చేతులతో విజయవంతంగా పూర్తి చేశారు. సాధారణంగా ఏదైనా నిర్మాణం చేపడితే.. ఆ కూలీలను గుర్తుంచుకోరు.. కానీ మోడీ సత్కరించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.