iDreamPost
android-app
ios-app

వీడియో: సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా ఏడ్చేసిన ప్రధాని మోదీ

  • Published Jan 19, 2024 | 4:31 PM Updated Updated Jan 19, 2024 | 4:31 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.

వీడియో: సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా ఏడ్చేసిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ది సంక్షేమ పథకాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు మోదీ నేతృత్వంలో అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది. బీజేపీ కార్యకర్తగా తన ప్రస్థానం మొదలు పెట్టి గుజరాత్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగారు. ఆ తర్వాత 2014 మే 26 న ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ వస్తున్నారు. మహారాష్ట్రలో ఓ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని సోలాపూర్ లో జరిగిన మహాసభలో ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఇక్కడ పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చుస్తూ తన బాల్యం గురించి గుర్తు చేసుకొని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. సోలాపూర్ లో 90 వేల మంది నిరుపేదలకు పీఎం ఆవాస్ (అర్బన్) కింద ఇళ్లు మంజూరు కాగా.. వాటిని లబ్దిదారులకు అంజేశారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఈ ఇళ్లను చూస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తున్నాయి. నా చిన్నతనంలో ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండు అనిపించేది అన్నారు. ఎప్పటి నుంచి నిరుపేదలు కంటున్న కల నిజమయినందుకు వారు మాత్రమే కాదు.. నేనూ సంతృప్తిగా ఉన్నారు. వాళ్ల ఆశీర్వాదమే నాకు పెద్ద ఆస్తి’ అని కన్నీరు పెట్టుకున్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.  దేశంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలి అన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు నిదర్శనమే నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం. మోదీ హామీ అంటే.. అది పూర్తి చేయడమే అని అర్థం. ఇటీవల పీఎం అర్బన్ స్కీమ్ కింద సోలాపూర్ లో రాయ్ హౌజింగ్ సొసైటీ అతి పెద్ద ప్రాజెక్టు అని గుర్తు చేశారు. ఇళ్లు మంజూరైన లబ్దిదారుల్లో శానిటరీ, చిరు వ్యాపారులు, ఆటో, బీడీ, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం మోదీ ఏడ్చేసిన వీడియో వైరల్ అవుతుంది.