P Krishna
Prices of Goods Increased in Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (జులై 23) 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సామాన్యులకు వివిధ వస్తువుల ధరలను ప్రభావితం చేసేలా ఈ బడ్జెట్ ఉందంటే పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Prices of Goods Increased in Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (జులై 23) 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సామాన్యులకు వివిధ వస్తువుల ధరలను ప్రభావితం చేసేలా ఈ బడ్జెట్ ఉందంటే పలువురు అభిప్రాయ పడుతున్నారు.
P Krishna
నేడు మంగళవారం (జులై 23) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోవ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2024 వార్సిక బడ్జెట్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పేదలు, మహిళలు, యువత, రైతు సంక్షేమాభివృద్దికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ఉద్యోగుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుతం పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రకటించారు. ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ వైద్య రంగానికి సంబంధించిన మూడు రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ పూర్తితా ఎత్తివేశారు. అలాగే ఇండస్ట్రీయల్ అభివృద్దికి ఊతమిచ్చే దిశగా చర్యల్లో భాగంగా 25 రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. ఈ బడ్జెట్ ఎఫెక్ట్ వల్ల ఈ వస్తువుల ధరలు పెగబోతున్నాయి. వివరాల్లోకి వెళితే..
2024 వార్షిక బడ్జెట్ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ సమావేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టీక్ వినియోగం తగ్గించేందుకు ప్లాస్టీక్ దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 25 శాతానికి పెంచారు. అలాగే రసాయనాలు, పెట్రోల్ కెమికల్స్ పై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. అలాగే టెలికాం పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 15 శాతం పెంచారు. ఎరువులు, పురుగుల మందు తయారీలో ఉపయోగించే అమ్మోనియం నైట్రేల్ పై కస్టమ్స్ ట్యాక్స్ పెంచారు. దీని వల్ల రాబోయే రోజుల్లో వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
కస్టమ్స్ సుంఖం పెంచడం వల్ల రాబోయే రోజుల్లో ఈ వస్తువులకు ధరలు పెరిగే అవకాశం ఉంది.. అందుకే ముందుకు గా కొని పెట్టుకుంటు బెటర్ అంటున్నారు నిపుణులు. బంగారం కడ్డీలు, వజ్రాల ఆభరణాలు, ప్లాటీనం వస్తువులు, కంపౌడ్ రబ్బర్, సిగరెట్, కాపర్ స్క్రాప్, కృత్రిమ ఆభరణాలు, వంట గది చిమ్నీలు, దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాల ధరలు పెరిగాయి. జీఎస్టీ కారణంగా సామాన్యులపై అధిక బరువు పడకుండా సరళంగా హేతుబద్దంగా జీఎస్టీని మార్చుతామని బడ్జెట్ సమావేశాలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేసుందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.