iDreamPost
android-app
ios-app

గర్బిణీలకు శుభవార్త.. బిడ్డ పుట్టిన వెంటనే 5 వేలు! పూర్తి వివరాలు!

  • Published Feb 24, 2024 | 9:41 PM Updated Updated Feb 24, 2024 | 10:12 PM

కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ద్వారా గర్భిణీ స్త్రీలకు రూ. 5 వేల అర్థిక సాయం అందిస్తూ వస్తోంది. మరి ఆ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి? అర్హులు ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ద్వారా గర్భిణీ స్త్రీలకు రూ. 5 వేల అర్థిక సాయం అందిస్తూ వస్తోంది. మరి ఆ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి? అర్హులు ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గర్బిణీలకు శుభవార్త.. బిడ్డ పుట్టిన వెంటనే 5 వేలు! పూర్తి వివరాలు!

కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్ లను ప్రజల కోసం ప్రవేశపెడుతోంది. అయితే వాటి గురించి తెలుసుకోకుండా.. ఎంతో మంది అర్హులు ఆ పథకాలను పొందలేకపోతున్నారు. ఇక దేశవ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గర్భిణీ తల్లుల లకు కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. దాని పేరే ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’. ఈ పథకం గర్భిణీ తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం స్టార్ట్ చేశారు. ఇక ఈ స్కీమ్ లో పుట్టిన వెంటనే రూ. 5 వేలు వస్తాయి. మరి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి? అర్హులు ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిరుపేద గర్భిణీ, బాలింతలకు డెలివరీకి ముందు తర్వాత అవసరమైన సౌకర్యాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక చేయూత స్కీమ్ అయిన ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ఫస్ట్ బిడ్డ పుట్టిన తల్లులకు రూ. 5 వేల రూపాయాలను అందిస్తారు. తల్లుల ప్రెగ్నెంట్ నమోదు అయిన తర్వాత తొలి విడతగా రూ. వెయ్యి, రెండవ విడత అనగా.. బుుతుస్రావం(ఎల్ఎంపీ) ఆరు నెలలో ప్రినేటల్ చెకప్ కోసం ఉంటుంది. ఇక మూడవ విడత డెలివరీ తర్వాత పిల్లల జనన నమోదు, BCG, OPV, DPT మరియు హెపటైటిస్-బి వ్యాక్సిన్‌లు ఫస్ట్ రౌండ్ పూర్తయిన తర్వాత మూడవ విడత డబ్బులు జమ అవుతాయి. అయితే ఈ స్కీమ్ కింద రెండవ బిడ్డ పుట్టిన వెంటనే ఒకేసారి రూ. 6 వేలు ఆర్థిక సాయం అందుతుంది.

పథకానికి అర్హులు

  • షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల స్త్రీలు
  •  40 శాతం వైకల్యం లేదా పూర్తి వైకల్యం ఉన్న మహిళలు
  •  బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న మహిళలు
  •  ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన మహిళా లబ్దిదారులు
  •  E- లేబర్ కార్డు ఉన్న స్త్రీలు
  •  కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతు మహిళా లబ్దిదారులు
  •  వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్నవారు
  •  ఉపాధిహామీ పథకం కార్డు(జాబ్ కార్డు) ఉన్నవారు
  •  గర్బిణీ అంగన్ వాడీ వర్కర్లు, అంగన్ వాడీ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు.

పై లిస్ట్ లో ఉన్న మహిళలు అంగన్ వాడీ సేవిక, ఆరోగ్య కేంద్ర ద్వారా శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ ఆఫీస్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. సదరు దరఖాస్తును పరిశీలించిన మహిళా అధికారులు పథకం పోర్టల్ లో నమోదు చేస్తారు. ఇలా కాకుండా.. లబ్ధిదారులు https://pmmvy.nic.in వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . ఇక ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి పిల్లల జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ కాపీ అవసరం.