Arjun Suravaram
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. లెక్కాపత్రం లేని నగదు కోట్లలో కట్టలు కట్టలుగా వాహనాల్లో తరలిపోతోన్నాయి. తాజాగా భారీగా నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. లెక్కాపత్రం లేని నగదు కోట్లలో కట్టలు కట్టలుగా వాహనాల్లో తరలిపోతోన్నాయి. తాజాగా భారీగా నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Arjun Suravaram
దేశం వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో ఫుల్ బిజీగా ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తోన్నాయి. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజకీయ పార్టీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ముమ్మురంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడా భారీగా నగదులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి. తాజాగా కర్నాటకలో భారీగా నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు భారీగా పట్టుబడుతోన్నాయి. అలానే లెక్కాపత్రం లేని నగదు కోట్లలో వాహనాల్లో ప్రాంతాలు మారుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు ఓటర్లకు పంపిణీ చేసేందుకు అనేక మార్గాల్లో నగదును తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలోని బళ్లారి జిల్లా కేంద్రంలో ఐదున్నర కోట్ల డబ్బులు, కేజీల కొద్ది బంగారం, వెండి పట్టుబడ్డాయి. బళ్లారి నగరంలోని బ్రూస్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేయగా.. ఓ కారులో భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వీటిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే..మూడు కిలోల బంగారం, భారీగా వెండి కూడా కారులో దొరికింది. బళ్లారి కార్పెట్ బజార్‌లో ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బు, నగలు తరలిస్తున్నట్లు గుర్తించారు అధికారులు.
అలానే బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బ్రూస్‌పేట్ పోలీసులు ఒక వ్యాపారి ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో డబ్బులను, బంగారం, వంద కేజీలకు పైగా వెండిని అధికారులు గుర్తించారు. బళ్లారిలోని ఆభరణాల వ్యాపారి అనేనరేశ్ సోనీ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు గుర్తించారు. వాటిలో లెక్కల్లోకి రానివి ఎక్కువగా భారీ ఉండటాన్ని గుర్తించిన పోలీసులు రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇలానే ఇప్పటికే అనేక చోట్ల అధికార పార్టీకి చెందిన వస్తువులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఇలా భారీగా నగదు పట్టుబతుండటంతో చెక్‌పోస్టుల దగ్గర పోలీసులు తనిఖీలు పెంచాయి. ఈ సోదాల్లో ఈ విధంగా భారీ ఎత్తున నగదు, బంగారం పట్టుబడుతోంది.