iDreamPost
android-app
ios-app

మీరు గ్రేట్: అనాథ యువతికి పెళ్లి చేసి..పల్లకి మోసిన పోలీస్ అధికారి!

Police Did Orphan Girl Marriage: నేటిసమాజంలో కొందరు మాత్రమే అనాథలను కూడ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. అందుకే అన్నీ తామై అనాథలను ఆదుకుంటారు. తాజాగా ఓ పోలీస్ అధికారి చేసిన పని అందరిని కన్నీరు పెట్టిస్తుంది. ఓ అనాథ యువతికి ఆయన అన్నగా మారి పెళ్లి చేశారు.

Police Did Orphan Girl Marriage: నేటిసమాజంలో కొందరు మాత్రమే అనాథలను కూడ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. అందుకే అన్నీ తామై అనాథలను ఆదుకుంటారు. తాజాగా ఓ పోలీస్ అధికారి చేసిన పని అందరిని కన్నీరు పెట్టిస్తుంది. ఓ అనాథ యువతికి ఆయన అన్నగా మారి పెళ్లి చేశారు.

మీరు గ్రేట్: అనాథ యువతికి పెళ్లి చేసి..పల్లకి మోసిన పోలీస్ అధికారి!

ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆడపిల్లకు ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని చూస్తుంటారు. అలానే ఎంతో మంది ఆడపిల్లలు తమ సోదరుల ప్రేమానురాగాల మధ్య అత్తారింటికి వెళ్తుంటారు. ఇలా సమాజంలో ప్రతి చోట జరుగుతుంది. కానీ కొందరు మాత్రం అనాథలను కూడ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. అందుకే అన్నీ తామై అనాథలను ఆదుకుంటారు. తాజాగా ఓ పోలీస్ అధికారి చేసిన పని అందరిని కన్నీరు పెట్టిస్తుంది. ఓ అనాథ యువతికి అన్నగా మారి పెళ్లి చేశారు.. ఆ పోలీస్ అధికారి. అంతేకాక సొంత చెల్లి పెళ్లిపల్లకి మోసినట్లు ఆయన మోశారు. ఈ హృదయాన్ని ఆకట్టుకునే ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

అనాథ యువతిని దత్తత తీసుకుని.. తన సొంత సొదరిలా ఘనంగా వివాహం జరిపించి అత్తారింటికి పంపి గొప్ప మనసు చాటుకున్నారు ఓ పోలీస్ అధికారి. ఆమె పెళ్లిలో అన్నీ తామై వ్యవహరించిన పోలీసులు.. తమ సోదరుల్లా పల్లకీ మోశారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్‌లో చోటుచేసుకుంది. అనాథకు అన్నదమ్ముల్లా నిలిచి వివాహ వేడుకను జరిపించిన పోలీసులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోర్గడ్ ప్రాంతంలోని ధార్చుల గ్రామంలో పుష్ప అనే యువతి నివాసం ఉంటుంది. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఇక అమ్మానాన్నలేక అనాథగా మారిన పుష్ప.. అమ్మమ్మ వద్దనే ఉంది. ఆ వృద్ధురాలే ఆ మనవరాలి కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తుంది. ఇదే సమయంలో 10 ఏళ్ల క్రితం పుష్ప అమ్మమ్మ కూడా చనిపోయింది. దీంతో పుష్ప ఎవరిలేని అనాథగా మిగిలిపోయింది. ఇక నా అనే వారు లేక.. తనకు సాయం చేసే బంధువులు లేక… పొట్టకూటి కోసం పని వెతుక్కుంటూ పిథోర్ గడ్ కి చేరుకుంది. ఈ క్రమంలోనే ఓ చోట పనిలో చేరిన ఆమెను కొన్నాళ్ల తర్వాత తీసేశారు.

Uttarakhand, Police, Orphan Girl marriage 02

దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ ఆలయం వద్దకు చేరుకుంది. అదే సమయంలో దేవుడే ఓ పోలీస్ అధికారి రూపంలో ఆమె వద్దకు వచ్చాడు. పిథోర్‌గఢ్ పోలీస్ ఇన్స్పెక్టర్ నరేశ్ చంద్ర జఖ్మోలా ఆ యువతిని చూసి ఆరా తీశారు.  పుష్ప..తన గురించి చెప్పిన స్టోరికీ ఆయన మనస్సు చలించింది. దీంతో పుష్పను దత్తత తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. అంతేకాక ఆమెను తన సొంత చెల్లెలి భావించి ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ రేఖా యాదవ్, సీఓ పర్వేజ్ అలీకి ఆయన తెలియజేశారు. కొద్ది రోజుల విపిన్ అనే యువకుడితో పుష్పకు పెళ్లి సంబంధం నిశ్చయం చేశాడు ఆ పోలీస్ అన్న.

సోదరుడి స్థానంలో ఉండి పుష్ప వివాహాన్ని ఘనంగా జరిపించాడు. సొంత అన్న కంటే ఎక్కువగా పుష్పను పల్లకిలో మోసి…పీటల మీదకు తీసుకొచ్చాడు నరేశ్ చంద్ర. ఇలా సంప్రదాయం ప్రకారం వైభవంగా పెళ్లిచేసి పుష్పను అత్తింటికి పంపారు. ఈ పెళ్లికి సహచర పోలీసులు కూడా నరేశ్ చంద్రకు తోడుగా నిలిచారు. ఈ వివాహానికి జిల్లా పోలీస్ ఉన్నాతాధికారులు హాజరై…నవదంపతులను ఆశీర్వదించారు. అనాథ యువతికి తన సొంత చెల్లిలా పెళ్లి జరిపించిన పోలీస్ అధికారి నరేశ్ చంద్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మీరు సూపర్ సార్ అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి