iDreamPost
android-app
ios-app

ఫేస్‌బుక్‌ ప్రేమ.. ప్రియుడి కోసం పోలాండ్‌నుంచి ఇండియాకు..

  • Published Jul 20, 2023 | 12:26 PM Updated Updated Jul 20, 2023 | 12:26 PM
  • Published Jul 20, 2023 | 12:26 PMUpdated Jul 20, 2023 | 12:26 PM
ఫేస్‌బుక్‌ ప్రేమ.. ప్రియుడి కోసం పోలాండ్‌నుంచి ఇండియాకు..

పబ్‌జీ కారణంగా ఇండియన్‌ వ్యక్తితో ప్రేమలో పడ్డ సీమా హైదర్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈమె ప్రియుడు సచిన్‌ కోసం పాకిస్తాన్‌నుంచి అక్రమంగా ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం ఆమెను ఉత్తర ప్రదేశ్‌ యాంటీ టెర్రరిజం అధికారులు విచారిస్తున్నారు. ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన ప్రియుడికోసం దేశం దాటింది. పోలాండ్‌కు చెందిన ఆ మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన ప్రియుడికోసం ఏకంగా ఇండియాకు వచ్చింది. అది కూడా తన 8 సంవత్సరాల కూతుర్ని వెంటబెట్టుకుని ప్రియుడి ముందు వాలిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలాండ్‌కు చెందిన బార్బరా అనే మహిళకు కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా ఇండియాకు చెందిన సాదబ్‌తో పరిచయం ఏర్పడింది. బార్బరాకు భారత సంస్కృతి సాంప్రదాయాలంటే ఇష్టం ఉండటంతో అతడితో బాగా కలిసిపోయింది. దీంతో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఆన్‌లైన్‌ ద్వారా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. అయితే, పెళ్లి ప్రస్తావన రావటంతో బార్భరా తనకు ఇది వరకే పెళ్లి అయిందని.. ఓ 8 సంవత్సరాల బిడ్డకూడా ఉందని చెప్పింది.

భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్నట్లు వెల్లడించింది. ఆమెకు ఓ బిడ్డ ఉందని తెలిసినా.. సాదబ్‌ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. సాదబ్‌ పోలాండ్‌ వెళ్లటం కుదరదు కాబట్టి.. ఆమే ఇండియాకు వస్తానంది. తన ప్రియుడి కోసం రెక్కలు కట్టుకుని ఇండియాలో వాలిపోయింది. బార్బరా రాకతో సాదబ్‌ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. వీరి పెళ్లికి పెద్దలు కూడా అడ్డు చెప్పలేదు. పెళ్లి తర్వాత సాదబ్‌ను తనతో పాటు పోలాండ్‌కు తీసుకుపోతానని బార్బరా స్పష్టం చేసింది. అక్కడ అతడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని అంది. త్వరలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరగనుంది. మరి, ఈ ఎల్లలు దాటిన ప్రేమ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom