iDreamPost
android-app
ios-app

మేం భారత్‌లో కలుస్తామంటూ వీధుల్లోకి వచ్చిన పాక్‌ ఆక్రమిత కశ్మీరీలు

  • Published Sep 01, 2023 | 1:49 PM Updated Updated Sep 01, 2023 | 1:49 PM
  • Published Sep 01, 2023 | 1:49 PMUpdated Sep 01, 2023 | 1:49 PM
మేం భారత్‌లో కలుస్తామంటూ వీధుల్లోకి వచ్చిన పాక్‌ ఆక్రమిత కశ్మీరీలు

బాబోయ్‌ మేం పాకిస్తాన్‌లో ఉండం.. మమ్మల్ని భారత్‌లోకి అనుమతించండి.. మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అంటూ.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో ఉన్న జనాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పాకిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న జనాలకు సంబంధించిన వీడియోలు.. నెట్టింట వైరల్‌గా మారాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాక స్థానిక ప్రజలు.. అంతర్యుద్దం జరగబోతుంది అంటూ.. పాక్‌ అధికారిక యంత్రాంగాన్ని హెచ్చరించడమే కాక.. భారత్‌లో విలీనమవుతామనే డిమాండ్‌ తెరపైకి తెచ్చారు. అంతేకాక.. చలో చలో కార్గిల్‌ చలో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. ఆందోళనకు దిగారు. మరి ప్రజలు ఇంత భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే..

గత నెల అనగా మేలో స్కర్దులో జరిగిన మతపరమైన సమావేశంలో.. షియా మత గురువు అఘా బాకిల్‌ అల్‌ హుస్సేనీ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి.. ఆయనను అరెస్ట్‌ చేశారు పోలీసులు. దాంతో నిరసనలు చెలరేగాయి. ప్రభుత్వం.. షియాలను టార్గెట్‌ చేస్తూ.. పాక్‌ దైవదూషణ చట్టాన్ని కఠినతరం చేశారనే ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. దీనిపై చర్చిండానికి.. అఘా బకీర్‌.. స్కర్దులో నిర్వహించిన ఉలేమా కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో అఘా బకీర్‌ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి.. ఆయనను అరెస్ట్‌ చేశారు.

ఇందుకు నిరసనగా.. జనాలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి.. నిరసన వ్యక్తంచేశారు. ఈక్రమంలోనే వారు రోడ్ల మీదకు వచ్చి.. తమను భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే గిల్గిత్‌లో జరిగిన నిరసనల గురించి పాక్ మీడియాలో కవరేజ్ లేనప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం.. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూస్తే.. ఆ ప్రాంతంలో ఆందోళన ఎంత తీవ్ర స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వీధుల్లోకి వచ్చిన జనాలు.. పాకిస్థాన్‌, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘‘ఇక్కడి ప్రజలు.. పంజాబ్ (పాకిస్థాన్) లేదా సింధ్‌కు వెళ్లానుకోవడం లేదు.. కానీ కార్గిల్‌కు వెళ్లాలని భావిస్తున్నారు.. వెళ్తారు. గిల్గిత్‌ను భారతదేశంలో విలీనం చేయండి’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాక అల్-హుస్సేనీని విడుదల చేయాడమేకాక.. కారాకోరం హైవేను క్లియర్ చేయాలనే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అంతర్యుద్ధం చేస్తామని జనాలు హెచ్చరిస్తున్నారు.