Tirupathi Rao
PM Modi Released 17th Term Of PM Kisan Funds: ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త అందించారు. 17వ విడత పీఎం- కిసాన్ నిధులను విడుదల చేశారు. వారణాసిలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేశారు.
PM Modi Released 17th Term Of PM Kisan Funds: ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త అందించారు. 17వ విడత పీఎం- కిసాన్ నిధులను విడుదల చేశారు. వారణాసిలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేశారు.
Tirupathi Rao
రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. 17వ విడత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేసింది. దేశంలో ఉన్న రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించిందే ఈ పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి. అప్పటి నుంచి ఏడాదిలో మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం 6 వేల రూపాయలు జమ చేస్తారు. అందులో భాగంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేసింది. ఉత్తరప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ నిధులను విడుదల చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులను విడుదల చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోనే ఈ నిధులను విడుదల చేశారు. మొత్తం దాదాపుగా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ నిధి కోసం నమోదు చేసుకున్న 9.6 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం రూ.20 వేల కోట్లు జమ చేశారు. తాజా ఎన్నికల్లో విజయం, జూన్ నెల 9వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత వారణాసికి రావడం ఇదే తొలిసారి.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే.. ప్రధాని కార్యాలయంలో మోదీ 17వ విడదల పీఏం- కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల దస్త్రంపై ప్రధాని మోదీ తొలి సంతకం చేశారు. ఈ వార్త విన్న 9.6 కోట్ల మంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పెట్టుబడికి సాయంగా ఉంటుందని తీసుకొచ్చిన ఈ పథకం తమకు అక్కరకు వస్తోంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తొలకరి జల్లులు ప్రారంభం కావడమే కాకుండా.. వర్షాలు కూడా బాగానే కురుస్తున్నాయి. రైతులు కూడా ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభించేశారు.
మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవాలంటే.. కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి.. కుడి వైపున ఉన్న నో యువర్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మీకు స్టేటస్ కనిపిస్తుంది. అప్పుడు హోమ్ పేజీలో ఉన్న బెనిఫిషియరీ లిస్ట్ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే.. అందులో లబ్ధిదారులు జాబితా వివరాలు కనిపిస్తాయి.