Swetha
ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు రోజుల పర్యటనలో భాగంగా అస్సాంకు వెళ్లారు. అక్కడ కజిరంగా పార్క్లో ఏనుగు సవారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు రోజుల పర్యటనలో భాగంగా అస్సాంకు వెళ్లారు. అక్కడ కజిరంగా పార్క్లో ఏనుగు సవారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Swetha
ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో .. ఎక్కడ చూసిన ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలిసారి అస్సాం లోని కజిరంగ నేషనల్ పార్క్‌కు వెళ్లారు నరేంద్ర మోడీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ అక్కడకి వెళ్లారు. శుక్రవారం రాత్రి కజిరంగ నేషనల్ పార్కుకు చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే స్టే చేసిన నరేంద్ర మోడీ .. శనివారం తెల్లవారుజామునే పార్కు మొత్తం సందర్శించారు. సాధారణంగా ఇప్పటివరకు నరేంద్ర మోడీ చేసిన ఎన్నో సాహసాలను, విన్యాసాలను .. ఇప్పటివరకు మనం చూస్తూనే వచ్చాము. వాటిని బట్టి చూస్తే నరేంద్ర మోడీకి సాహసాలు చేయడం ఇష్టమని.. అందరు టక్కున చెప్పేస్తారు. ఈ క్రమంలో కజిరంగ నేషనల్ పార్క్ కు వెళ్లిన నరేంద్ర మోడీ .. అందరికి ఆశ్చర్యం కలిగించేలా.. ఏనుగుపై సవారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ ప్రతి విషయంలోను అందరికి ఆశ్చర్య పరుస్తూనే ఉన్నారు. లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్.. ఆ తర్వాత సముద్రంలో మునిగిన ద్వారకకు స్కూబా డైవింగ్ చేసి.. మరీ వెళ్లి పూజలు చేయడం. ఇలా అనేక రకాల విన్యాసాలు చేసి అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కజిరంగ నేషనల్ పార్క్ లో ఏనుగుపై సవారీ చేశారు. 1957 తర్వాత ఒక దేశ ప్రధాని అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. అందులోను ఆ ప్రధాని నరేంద్ర మోడీ అవ్వడం మరింత విశేషం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కజిరంగ జాతీయ పార్క్ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. ఇక రాత్రి కజిరంగ నేషనల్ పార్క్‌లోనే బస చేసిన మోడీ.. శనివారం తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్ కొహోరా రేంజ్‌ను సందర్శించారు. ముందుగా ఏనుగు మీద సవారి చేసిన నరేంద్ర మోడీ.. ఆ తర్వాత జీపులో సఫారీ చేశారు. ఆ సమయంలో మోడీ వెంట.. కజిరంగ నేషనల్ పార్క్ డైరెక్టర్ సొనాలీ ఘోష్, అటవీ శాఖ సీనియర్ అధికారులు ఉన్నారు.
ఈ క్రమంలో తానూ కజిరంగ నేషనల్ పార్క్‌లో పర్యటించిన విషయాన్నీ, దానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. తానూ అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో పర్యటించానని.. దట్టమైన పచ్చదనం మధ్య ఉన్న ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఖడ్గమృగంతో సహా.. విభిన్న జాతుల వృక్షాలు, జంతువులు ఉన్నాయని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక దాని తర్వాత నరేంద్ర మోడీ.. శనివారం మధ్యాహ్నం జోర్‌హట్‌లో కమాండర్ లచిత్ బర్ఫుకాన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దాని తర్వాత మోడీ పలు కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయనున్నారు. మరి,ప్రధాని నరేంద్ర మోడీ ఏనుగుపై సవారీ చేస్తున్న ఫోటోలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Feeding sugar cane to Lakhimai, Pradyumna and Phoolmai. Kaziranga is known for the rhinos but there are also large number of elephants there, along with several other species. pic.twitter.com/VgY9EWlbCE
— Narendra Modi (@narendramodi) March 9, 2024
I would urge you all to visit Kaziranga National Park and experience the unparalleled beauty of its landscapes and the warmth of the people of Assam. It’s a place where every visit enriches the soul and connects you deeply with the heart of Assam. pic.twitter.com/MFCg9oeFm3
— Narendra Modi (@narendramodi) March 9, 2024
This morning I was at the Kaziranga National Park in Assam. Nestled amidst lush greenery, this UNESCO World Heritage site is blessed with diverse flora and fauna including the majestic one horned rhinoceros. pic.twitter.com/68NEtoGAoz
— Narendra Modi (@narendramodi) March 9, 2024