Venkateswarlu
అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మొదలైంది. ఈ మధ్యాహ్నం బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మొదలైంది. ఈ మధ్యాహ్నం బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
Venkateswarlu
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ హిందువు కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సోమవారం రోజున అయోధ్య మందిర ప్రారంభంతో పాటు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. మధ్యాహ్నం నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. హిందువులకు ఎంతో పరమ పవిత్రమైన ఈ మహోన్నత ఘట్టంలో భాగం కావటానికి మోదీ కఠిన దీక్ష చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనుంచి ఆయన దీక్ష చేస్తూ వస్తున్నారు. మొత్తం 11 రోజుల పాటు ఈ దీక్ష ఉండనుంది.
తన డైలీ పనులతో పాటు కఠిన దీక్షా నియమాలు పాటిస్తున్నారు. సూర్యోదయానికి ముందుగానే మోదీ నిద్ర లేస్తున్నారు. నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని, ద్యానం చేస్తున్నారు. ఆ తర్వాత యోగాసనాలు వేస్తున్నారు. స్నానం తర్వాత తిండి తినటం జోలికి పోవటం లేదు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ ఉన్నారు. ఒకరకంగా కఠినమైన తపస్సు చేస్తున్నారు. కొబ్బరి నీళ్లు తాగే అన్ని చోట్లకు పర్యటిస్తున్నారు. ఇక, నిద్ర విషయంలో కఠిన నిమయాన్నే పాటిస్తున్నారు.
ఎముకలు కొరికే చలిలోనూ కేవలం నేలపై దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారు. అంతేకాదు! నిన్నటి వరకు దేశంలోని ప్రధాన రామ మందిరాలను ఆయన సందర్శించారు. కాగా, ఈ రోజు రామ మందిర ప్రారంభం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తవుతుంది. రేపటి నుంచి సాధారణ భక్తులకు దేవుడ్ని దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. ఇప్పుడు కేవలం తొలి దశ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం పనులు పూర్తవ్వటానికి 2025 అవుతుందని రామ మందిర ట్రస్ట్ తెలిపింది.
రామ మందిర ఆలయ నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది హిందువులు భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చారు. అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు దాదాపు 2100 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ప్రస్తుతం రామ మందిరం కోసం 1800 కోట్ల రూపాయల్ని మాత్రమే ఖర్చు చేశారు. రామ మందిర నిర్మాణం కోసం ఇతర రూపాల్లో వచ్చిన దాదాపు 3 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మరి, అయోధ్య రాములోరి కోసం ప్రధాని నరేంద్ర మోదీ కఠిన దీక్ష చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.