iDreamPost
android-app
ios-app

ఆ స్పెషల్‌ ప్లేస్‌లో.. 45 గంటల ధ్యానంలో కూర్చోనున్న ప్రధాని మోదీ!

  • Published May 30, 2024 | 1:48 PMUpdated May 30, 2024 | 4:08 PM

PM Modi, Vivekananda Rock, Kanyakumari: ప్రధాని మోదీ 24 గంటల ధ్యానం కోసం కూర్చోబోతున్నారు. అయితే దాని కోసం ఒక ప్రత్యేక ప్లేస్‌ను ఎంచుకున్నారు. దాని ప్రాధాన్యత ఏంటి? ఎందుకు అదే ప్లేస్‌ ఎందుకు ఎంపిక చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

PM Modi, Vivekananda Rock, Kanyakumari: ప్రధాని మోదీ 24 గంటల ధ్యానం కోసం కూర్చోబోతున్నారు. అయితే దాని కోసం ఒక ప్రత్యేక ప్లేస్‌ను ఎంచుకున్నారు. దాని ప్రాధాన్యత ఏంటి? ఎందుకు అదే ప్లేస్‌ ఎందుకు ఎంపిక చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 30, 2024 | 1:48 PMUpdated May 30, 2024 | 4:08 PM
ఆ స్పెషల్‌ ప్లేస్‌లో.. 45 గంటల ధ్యానంలో కూర్చోనున్న ప్రధాని మోదీ!

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గత 75 రోజులుగా విరామం లేకుండా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇక ప్రచారం ముగించి.. విశ్రాంతి తీసుకోనున్నారు. గత 75 రోజులుగా 180 ర్యాలీలు, లెక్కలేనన్న సభల్లో పాల్గొన్న ఆయన.. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసిపోవడంతో.. గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు అంటే.. 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఎన్నికల హడావిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 1తో లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఈ గ్యాప్‌లో మోదీ తనకు అలవాటు అయిన ధ్యానంలో గడిపేందుకు ఇష్టపడుతున్నారు.

అయితే.. ఈ 45 గంటల ధ్యానం కోసం ఆయన ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌లో ఆయన ధ్యానంలో కూర్చోనున్నారు. అయితే.. ఈ ప్లేస్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ప్రధాని మోదీ ధ్యానం కోసం కూర్చోబోయే ప్లేస్‌లోనే స్వామి వివేకనందా కూడా ధ్యానం చేసినట్లు చరిత్ర చెబుతోంది. తత్వవేత్త, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన స్వామి వివేకనందుడి గురించి అందరికి తెలిసిందే. ఆయన 1892లో కన్యాకుమారి తీరం నుంచి ఒక ద్వీపానికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ మూడు రోజులు ధ్యానం చేసి, జ్ఞానోదయం పొందారు. అదే వివేకానంద రాక్‌ మెమొరియల్‌ అయింది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా అదే ప్లేస్‌లో వివేకానంద ధ్యానం చేసిన ప్లేస్‌లోనే 45 గంటల పాటు ధ్యానంలో కూర్చోనున్నారు.

హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కలిసే ప్రదేశంలో కన్యాకుమారిలోని వావతురై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. ఇలా ఎక్కువ సయమం ధ్యానంలో కూర్చోవడం ప్రధాని మోదీకి ఇది తొలిసారి కాదు. ఆయన గతంలో కూడా పలు సందర్భాల్లో ఎక్కువ గంటలు ధ్యానంలో గడిపారు. 2019 ఎన్నికల ప్రచారం ముగింపు సమయంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని రెండు రోజుల పాటు సందర్శించి, అక్కడ 15 గంటల ‘ఏకాంతవాస్'(ఏకాంత ధ్యానం) నిర్వహించారు. అలాగే 2014లో మహారాష్ట్రలోని ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు. మరి ప్రధాని మోదీ 45 గంటల ధ్యానంలో కూర్చోనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి