Tirupathi Rao
PM Modi hoisted National Flag At Red Fort: ఎర్రకోట మీద ప్రధాని మోదీ జాతీయ జెడాను ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేశారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి దేశం ఎదగాలి అని ఆకాంక్షించారు.
PM Modi hoisted National Flag At Red Fort: ఎర్రకోట మీద ప్రధాని మోదీ జాతీయ జెడాను ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేశారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి దేశం ఎదగాలి అని ఆకాంక్షించారు.
Tirupathi Rao
78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ.. తర్వాత ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగురవేశారు. 11వసారి వరుసగా మోదీ ప్రధానిగా ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలకు మొత్తం 6 వేల మంది అతిథులు హాజరయ్యారు. జెండాను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి అని ఆకాంక్షించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయం అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో త్రివిధ దళాల కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
“పంద్రాగస్టు సందర్భంగా దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందాం. దేశం కోసం ఎందరో మహనీయులు వారి జీవితాలను పణంగా పెట్టారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ మహనీయులు అందరికీ దేశం రుణపడి ఉంది. భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. స్వతంత్రం కోసం ఆనాడు 40 కోట్ల మంది ప్రజలు పోరాడారు. భారత్ ను తయారీ రంగంలో గ్లోబల్ హబ్ గా మార్చాలి. వికసిత్ భారత్ 2047 నినాదం.. దేశ ప్రజల కలల తీర్మానం. మన దేశ అభివృద్ధికి పాలనా సంస్కరణలు అత్యవసరం. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి. వోకల్ ఫర్ లోకల్ అనేది మన వ్యూహం. ఈ నినాదమే మన ఆర్థిక వ్యవస్థలో మార్పు తీసుకొచ్చింది.
మనం ‘నేషన్ ఫస్ట్.. రాష్ట్ర్ హిత్ సుప్రీం’ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రపంచంలోనే మన బ్యాకింగ్ వ్యవస్థ బలమైనది. భారత్ కు చెందిన చిరుధాన్యాలు ప్రపంచం మొత్తానికి చేరాలి. అన్ని రంగాల్లో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. యువతకు విశేష అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుంది. కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తాం. మన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితిని నేను కోరుకోను. మధ్యతరగతి ప్రజలు పిల్లల విదేశీ చదువుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. మన పిల్లలు ఇక్కడే చదువుకునేలా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలి. విదేశీ విద్యార్థులే మన దేశానికి వచ్చి చదువుకునేలా మన వ్యవస్థ బలపడాలి. నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరిద్దాం. ప్రజల భవిష్యత్తు కోసం చేపట్టే ప్రతీ కార్యక్రమంలో దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Addressing the nation on Independence Day. https://t.co/KamX6DiI4Y
— Narendra Modi (@narendramodi) August 15, 2024