iDreamPost
android-app
ios-app

VIDEO: ఇస్రో సైంటిస్టులను అభినందిస్తూ.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ!

  • Published Aug 26, 2023 | 1:54 PM Updated Updated Aug 26, 2023 | 1:54 PM
  • Published Aug 26, 2023 | 1:54 PMUpdated Aug 26, 2023 | 1:54 PM
VIDEO: ఇస్రో సైంటిస్టులను అభినందిస్తూ.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ!

చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని విజయవంతం చేసి ప్రపంచం ముందు భారతదేశ ప్రతిష్టతను పెంచింది ఇస్రో(ఇండియన్ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌). జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి చంద్రయాన్‌-3 రాకెట్‌ను నింగిలోకి పంపింది. వివిధ దశలను దాటుకుంటూ ఆగస్టు 23న విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై సక్సెస్‌ఫుల్‌గా దిగింది. దీంతో చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది. అలాగే చంద్రుడి దక్షిణ ద్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. ఇంతటి ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జడివాన కురిసింది. భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి.

విక్రమ్‌ ల్యాండర్ జాబిల్లిపై దిగుతున్న సమయంలో మన ప్రధాని నరేంద్ర మోదీ సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నారు. సరగ్గా విక్రమ్‌ ల్యాండర్‌ 23న సాయంత్రం 6.04 నిమిషాలకు జాబిల్లిపై ల్యాండ్‌ అయిన తర్వాత.. అక్కడి నుంచే లైవ్‌ కాన్ఫరెన్స్‌లో శాస్త్రవేత్తలకు, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ, ఇస్రో శాస్త్రవేత్తల కష్టాన్ని తక్కువ చేయకుండా.. వారిని నేరుగా అభినందించేందుకు సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని వచ్చీ రావడంతోనే బెంగుళూరులో ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. దేశం గర్వించేలా కృషి చేసిన వారిని ప్రధాని అభినందించారు.

ఈ క్రమంలోనే మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శాస్త్రవేత్తలను ఉద్దేశిస్తూ.. మాట్లాడుతున్న సమయంలో ఆయన కళ్లలో నీరు నిండిపోయింది. గంభీరమైన గొంతుతో ప్రధాని మాట్లాడుతుంటే.. అక్కడున్న వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం మోదీ ఎమోషనల్‌ అయిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, చంద్రయాన్‌-3 చంద్రుడిపై దిగిన ప్రాంతానికి మోదీ శివశక్తి అని పేరు పెట్టారు. మరి ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురికావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ISRO సైంటిస్టుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం!