PM Modi Announced New Scheme: అయోధ్య నుంచి రాగానే ప్రధాని కొత్త పథకం ప్రకటన.. కోటి మంది ఇళ్లలో..

అయోధ్య నుంచి రాగానే ప్రధాని కొత్త పథకం ప్రకటన.. కోటి మంది ఇళ్లలో..

PM Modi Announced New Scheme: అయోధ్యలో అంగరంగవైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని కొత్త పథకాన్ని వెల్లడించారు.

PM Modi Announced New Scheme: అయోధ్యలో అంగరంగవైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని కొత్త పథకాన్ని వెల్లడించారు.

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామయ్య భక్తులు తిలకించి పులకించి పోయారు. ఈ మహత్తర ఘట్టం కోసం కోట్ల మంది ప్రజలు 500 ఏళ్లుగా ఎదురుచూశారు. జనవరి 22న ఆ మహత్తర కార్యం అట్టహాసంగా ముగిసింది. ప్రధాని మోదీ 11 రోజులపాటు కఠిన దీక్షను కూడా తీసుకున్నారు. కఠిక నేల మీద పవళింపు, కొబ్బరి నీళ్లను మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. ఇంతటి మహత్తర కార్యాన్ని ఘనంగా ముగించిన తర్వాత మరో బృహత్తర కార్యానికి ప్రధాని శ్రీకారం చుట్టారు. ఆ అద్భుతమైన పథకం గురించి అయోధ్య నుంచి రాగానే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఇప్పటికే దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని పేరిట చాలానే సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ జాబితాలోకి మరో కొత్త పథకం చేరనుంది. అన్ని పథకాలతో పోలిస్తే ఈ పథకం మరింత ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ పథకాన్ని ఆ అయోధ్య రామయ్యకు ముడి పెడుతూ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆ పథకం పేరు “ప్రధానమంత్రి సూర్యోదయ యోజన”. దీనికి శ్రీరామునికి ఉన్న సంబంధం ఏంటంటే.. ఆ శ్రీరాముడు సూర్యవంశీయుడని అందరికీ తెలిసిందే. ఆ రామయ్య ఆశీస్సులతో దేశంలో ఉన్న కోటి మంది ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు జనవరి 22న ప్రధాని మోదీ ప్రగకటించారు.

ఈ పీఎం సూర్యోదయ యోజన కింద కోటి మంది ఇళ్లల్లో సోలార్ వెలుగులు నింపనున్నారు. ఈ పథకానికి సంబంధించిన ఫొటోలను ప్రదాని మోదీ తన ఎక్స్.కామ్ లో షేర్ చేశారు. “సూర్యవంశీయుడైన ఆ శ్రీరామ మూర్తి కాంతి నుంచి ప్రపంచంలోని భక్తులు అందరూ శక్తిని పొందుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సొంత సోలార్ ప్యానెల్స్ కలిగి ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. నేను అయోధ్య నుంచి రాగానే తీసుకున్న మొదటి నిర్ణయం ఇది. కోటి మంది ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రదానమంత్రి సూర్యోదయ యోజన ను ప్రారంభించబోతున్నాం” అంటూ ప్రధాని మోదీ వెల్లడించారు.

ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకానికి సంబంధించిన ఫొటోలను కూడా పోస్టు చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కోటి మంది ప్రజలకు విద్యుత్ ఖర్చులు తగ్గిపోయినట్లే అంటున్నారు. అలాగే పర్యావరణానికి కూడా మేలు చేసినట్లు అవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం.. అది కూడా ప్రజలకు మేలు చేసిది కావడం హర్షించదగ్గ విషయం అంటూ ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments