iDreamPost
android-app
ios-app

పీఎం కిసాన్‌ 18వ విడత నిధులు? ఈ రెండు పనులు చేయకుంటే డబ్బులు రావు!

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు  కర్షకుల ఆదాయం పెంచే విధంగా పలు స్కీమ్ ను అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ యోజనకు సంబంధించి కీలక న్యూస్ ఒకటి వచ్చింది.

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు  కర్షకుల ఆదాయం పెంచే విధంగా పలు స్కీమ్ ను అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ యోజనకు సంబంధించి కీలక న్యూస్ ఒకటి వచ్చింది.

పీఎం కిసాన్‌ 18వ విడత నిధులు? ఈ రెండు పనులు చేయకుంటే డబ్బులు రావు!

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అలానే మహిళలు, రైతులు, యువత అభివృద్థి కోసం కూడా ఎన్నో స్కీమ్స్ ను ప్రారంభించింది. ముఖ్యంగా వ్యవసాయరంగాన్ని అభివృద్ది చేసేందుకు, రైతుల ఆదాయం పెంచేందుకు అనేక సదుపాయాలను కేంద్రం కల్పిస్తుంది. అలానే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ.… ఆర్థికంగా ఆదుకుటుంది. ఈ క్రమంలోనే తరచూ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతుంది. ముఖ్యంగా పీఎం కిసాన్ కి సంబంధించి ఏదో ఒక న్యూస్ వస్తోంది. అలానే తాజాగా 18వ విడత పీఎం కిసాన్ కి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు  కర్షకుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. రైతులకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను అందించే పథకామే పీఎం కిసాన్ యోజన. 2018 సంవత్సరంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏటా రూ.6 వేలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17 విడతల్లో భారత ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి 17వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.

ఇక ఈ స్కీమ్ కింద తదుపరిగా 18వ విడత రావాల్సి ఉంది. 18వ విడతను పీఎం కిసాన్ యోజన్ అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవచ్చు. అయితే ఈ నిధులు విడుదల సమయం దగ్గర పడే లోపు..  రైతులు కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. లేదంటే వారి పీఎం కిసాన్ నిధులు పడకుండా పోయే అవకాశం ఉంది. ఈ నిధులు పొందే రైతులకు సంబంధించి ఇప్పటికే కీలక విషయాలను కేంద్ర ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసింది. పథకం కోసం పొందాలనుకునే వారు, లబ్ధిదారులైన రైతులు ఇ-కెవైసి, భూమికి సంబంధించిన ధృవీకరణను పొందడం చాలా అవసరం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చేయని రైతులు వెంటనే చేసుకోవడం ఉత్తమం. లేకుంటే 18వ విడత నిధులు నిల్చిపోయే అవకాశం ఉంది. మరి..ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.