iDreamPost
android-app
ios-app

రైతన్నలకు శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.2వేలు జమ

  • Published Feb 23, 2024 | 10:12 AM Updated Updated Feb 23, 2024 | 10:12 AM

PM Kisan Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త చెప్పింది. వారి ఒక్కొక్కరి ఖాతాలో 2 వేలు జమచేయనుంది. ఆ వివరాలు..

PM Kisan Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త చెప్పింది. వారి ఒక్కొక్కరి ఖాతాలో 2 వేలు జమచేయనుంది. ఆ వివరాలు..

  • Published Feb 23, 2024 | 10:12 AMUpdated Feb 23, 2024 | 10:12 AM
రైతన్నలకు శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.2వేలు జమ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను ఆదుకునేందుకు అనేక రకాల పథకాలను తీసుకువస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడి సాయం కింద క్రాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరానికి 15 వేల సాయం అందిస్తుంది. గతంలో ఇది పదివేల రూపాయలుగా ఉండేది. ఇక కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించి.. ఏడాదికి 6 వేల రూపాయల సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కేంద్రం రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి అకౌంట్లోకి డబ్బులు పడబోతున్నాయని ప్రకటించింది.  ఆ వివరాలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కిసాన్‌ యోజన 16వ విడత నిధుల్ని.. ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్ నుంచి మోదీ ఈ నిధులు విడుదల చేస్తారు. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్, పీఎం కిసాన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్‌ చేశాయి. చివరిసారిగా 15వ విడత నిధుల్ని నవంబర్ 15న విడుదల చేశారు మోదీ. అప్పుడు మొత్తం 8 కోట్లకుపైగా లబ్ధిదారుల ఖాతాలో.. రూ. 18 వేల కోట్ల మొత్తం విడుదల చేశారు. తాజాగా 16వ విడతలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 2 వేలు పడనున్నాయి.

రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తున్న పీఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభమైంది. దీనిని ఏడాదికి రూ. 6 వేలు అంటే ప్రతి 4 నెలలకు ఓసారి మొత్తం 3 విడతల్లో రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుంది కేంద్రం. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఈ స్కీం ప్రారంభించింది.

ఇక పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే.. అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్ కార్డుతో లింక్‌ చేసిన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. అంతేకాక దీనికి ఇ-కేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. కేవైసీ ఉంటేనే డబ్బులు అకౌంట్లో పడతాయని గుర్తుంచుకోవాలి. గతంలో చాలా సార్లు ఈ ఇబ్బంది వల్ల చాలా మంది అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్‌లో ఉంచుకోవాలి.

అలానే పీఎం కిసాన్ స్కీమ్‌కు సంబంధించి స్టేటస్ తెలుసుకోవాలన్నా.. లేదా పీఎం కిసాన్ లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరుందో లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ వివరాల్ని పొందేందుకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet