iDreamPost
android-app
ios-app

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ సాయం పెంపు?

  • Author Soma Sekhar Published - 11:11 AM, Tue - 24 October 23

పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 6 వేలను పెట్టుబడి సాయం కింద అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాల్సిందిగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రిలేషన్స్ తన నివేదికను సమర్పించింది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 6 వేలను పెట్టుబడి సాయం కింద అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాల్సిందిగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రిలేషన్స్ తన నివేదికను సమర్పించింది.

  • Author Soma Sekhar Published - 11:11 AM, Tue - 24 October 23
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ సాయం పెంపు?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట సాయం కింద పలు పథకాల ద్వారా పెట్టుబడిని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ ద్వారా రైతులకు రూ. 6 వేలను నేరుగా వారి అకౌంట్లోనే వేస్తోంది. మూడు విడుతలుగా ఈ సాయాన్ని అందిస్తోంది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పటి వరకు 14 విడతల కింద అర్హులు గల రైతుల అకౌంట్లో రూ. 28 వేలు జమ చేసింది. ప్రస్తుతం 15వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు ఓ శుభవార్త చెప్పింది ICRIER(ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రిలేషన్స్). రైతులకు ఈ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాల్సిందిగా తన రిపోర్ట్ సమర్పించింది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 6 వేలను పెట్టుబడి సాయం కింద అందిస్తోంది. మూడు విడుతలుగా ఈ డబ్బులను వారి అకౌంట్లో నేరుగా జమచేస్తోంది. కాగా.. వస్తువుల ద్రవ్యోల్బణం చాలా రేట్లు పెరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అందించే పంట సాయం కనీసం రూ. 10వేలు ఇవ్వాలని ICRIER(ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రిలేషన్స్) తన నివేదికను సమర్పించింది. రైతుల ఆర్థిక పరిస్థితులను పరిగణంలోకి తీసుకుని సాయం పెంచాల్సిందింగా ప్రభుత్వానికి సూచించింది.

భారతదేశంలో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. కాగా.. ఇటీవలే ఈ పథకంలో ఉన్న అనర్హులను తొలగించింది కేంద్రం. దీంతో కేంద్రానికి రూ. 10 వేల కోట్లు ఆదా అయ్యాయి. అయితే భూమి లేని రైతులు, కౌలు రైతులను కూడా ఈ పథకంలో చేర్చాలన్న డిమాండ్లు పెరిగాయి. ఇదిలా ఉండగా.. ఈ స్కీమ్ మార్పులకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం బయటకి రాలేదు. మరి రైతుల పరిస్థితిని గమనించిన ICRIER సంస్థ.. వారికి సాయం పెంచాలని రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఈ నివేదికపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.