iDreamPost
android-app
ios-app

డ్రోన్ కొనాలంటే ఈ రూల్స్ పాటించాలి.. లేదంటే సీదా జైలుకే..

  • Published Sep 05, 2024 | 3:19 PM Updated Updated Sep 05, 2024 | 3:19 PM

Drones Rules and Regulations: మనిషి ఇప్పుడు టెక్నాజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. డ్రోన్లు వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా వాడుతున్నారు. అయితే డ్రోన్ల వాడకంపై కొన్ని రూల్స్ ఉన్నాయన్న విషయం తెలుసా..

Drones Rules and Regulations: మనిషి ఇప్పుడు టెక్నాజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. డ్రోన్లు వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా వాడుతున్నారు. అయితే డ్రోన్ల వాడకంపై కొన్ని రూల్స్ ఉన్నాయన్న విషయం తెలుసా..

డ్రోన్ కొనాలంటే ఈ రూల్స్ పాటించాలి.. లేదంటే సీదా జైలుకే..

ఇటీవల కాలంలో డ్రోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రత్యేక ఈవెంట్స్ షూట్ చేయడానికి ఫోటో గ్రాఫర్లు డ్రోన్స్ వాడుతున్నారు. ఇక యూట్యూబర్స్, షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు సైతం డ్రోన్ల సాయంతో షూటింగ్ చేస్తున్నారు.డ్రోన్స్ వాడాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని మీరితే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.అంతేకాదు కొన్ని అనుమతి లేని ప్రదేశాల్లో డ్రోన్లు ఎగురవేసినా కఠిన చర్యలు తీసుకుంటారని బోర్డు రాసిపెడుతుంటారు. ముఖ్యంగా మిలటరీ ఏరియా, దేవాలయాలపై డ్రోన్స్ ఎగురవేయరాదని ఆంక్షలు. తాజాగా డ్రోన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలో డ్రోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే డ్రోన్లు మంచి కోసం కాకుండా కొంతమంది ఆకతాయిలు చెడు కోసం వినియోగించడంతో అనర్ధాలు జరుగుతున్నాయి. దేశంలో కొంతమంది డ్రోన్లు దేవాలయాలపై ఎగురువేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. డ్రోన్ల వాడకంపై కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. డ్రోన్ నియమాలు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మినహా అందరికీ వర్తిస్తాయి. డ్రోన్ ఎగరడానికి లైసెన్స్ తప్పనిసరి, ఎవరైనా లైసెన్స్ లేకుండా డ్రోన్ ఎగురవేస్తే, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అంటున్నారు. ఒక వ్యక్తి డ్రోన్ ను అక్రమంగా ఉపయోగిస్తూ పట్టుబడితే అతనికి జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఖరీదైన డ్రోన్లు ఇప్పుడు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. కనుక సాధారణ ప్రజలు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇఫ్పుడు డ్రోన్లు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అందుబాటులో ఉన్నాయి.

డ్రోన్లను ఎగురవేయాడానికి కొన్ని నియమాలు, నిబంధలు రూపొందించబడ్డాయి.మీరు డ్రోన్ ను ఎగురవేయాలంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MOCA), డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)జారీ చేసిన డ్రోన్ రూల్స్ 2021 గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ నియమాల ప్రకారం డ్రోన్ కొనుగోలు చేసిన తర్వాత దాని డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. అదనంగా.. మీరు డ్రోన్ ఎక్కడ ఎగురవేయబోతున్నారో కూడా చెప్పాల్సి ఉంటుంది. డ్రోన్ పరిమాణం ఎంత చిన్నదైనా అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా ఎగురవేస్తే ఎయిర్ క్రాప్ట్ చట్టం, 1934 లోని నిబంధనల ప్రకారం శిక్షార్హులవుతారని అధికారులు అంటున్నారు. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు. డ్రోన్లలో చిన్న, మధ్యస్థ, పెద్ద డ్రోన్ లుగా మూడు రకాలుగా విభజించారు. చిన్న డ్రోన్ల బరువు 2 నుంచి 25 కిలోల వరకు , మీడియం డ్రోన్ల బరువు 25 నుంచి 150 కిలోల వరకు, పెద్ద డ్రోన్ల బరువు 150 నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. దీని కన్నా పెద్ద డ్రోన్లు UAV ఎయిర్ క్రాప్ట్ రూల్స్ 1937 కింద వస్తాయి. డ్రోన్ ను ఎగురవేయడానికి మీరు డిజిటల్ స్కై ఫ్లాట్ ఫారం నుంచి సర్టిఫికెట్ తప్పకుండా పొందాలి. యూఐఎన్ నంబర్ తప్పకుండా రూపొందించాలి.