iDreamPost
android-app
ios-app

గుడ్‌న్యూస్‌.. అయోధ్యకు ఉచిత బస్‌ టికెట్‌.. వారికి మాత్రమే ఈ ఆఫర్‌

  • Published Jan 22, 2024 | 4:10 PM Updated Updated Jan 22, 2024 | 4:10 PM

Paytm Free Bus Ticket-Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. రేపటి నుంచి సామాన్య భక్తులకు అవకాశం కల్పించనున్నారు. ఈక్రమంలో అయోధ్య వెళ్లే వారి కోసం గుడ్‌ న్యూస్‌

Paytm Free Bus Ticket-Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. రేపటి నుంచి సామాన్య భక్తులకు అవకాశం కల్పించనున్నారు. ఈక్రమంలో అయోధ్య వెళ్లే వారి కోసం గుడ్‌ న్యూస్‌

  • Published Jan 22, 2024 | 4:10 PMUpdated Jan 22, 2024 | 4:10 PM
గుడ్‌న్యూస్‌.. అయోధ్యకు ఉచిత బస్‌ టికెట్‌.. వారికి మాత్రమే ఈ ఆఫర్‌

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగం వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ క్రతువును ప్రత్యక్షంగా వీక్షించడం కోసం వేలాది మంది జనాలు తరలి వచ్చారు. జైశ్రీరామ్‌ నినాదాల మధ్య.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా దేశ వ్యాప్తంగా జైశ్రీరామ్‌ నినాదాలు ఆకాశాన్నంటాయి. వందల ఏళ్లుగా ఎదురు చూస్తోన్న కోట్లాది మంది హిందువుల కలలు నేడు సాకారం అయ్యాయి. అయోధ్య రామయ్య కోసం దేశ, విదేశాల నుంచి భారీ ఎత్తున కానుకలు వచ్చాయి.

ఇక నేడు అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా మొదటి రోజు కేవలం ప్రత్యేక అతిథులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసిన తర్వాత రోజు నుంచి అనగా జనవరి 23, మంగళవారం నుంచి సామాన్య భక్తులకు కూడా అయోధ్య రాముడిని దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే దేశం నలు మూలల నుంచి భారీ ఎత్తున భక్తులు అయోధ్యకు చేరుకుని బాలరాముడిని తనివితీరా దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అలా అయోద్య వెళ్లాలనుకునేవారికి డిజిటల్ పేమెంట్స్ యాప్ అయిన పేటీఎమ్ గుడ్‌న్యూస్ చెప్పింది. అయోధ్య వెళ్లేవారికి ఫ్రీగా బస్ టికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

free bus tickets for ayodhya

అయోధ్యకు వెళ్లేందుకు రోడ్డు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయోధ్య రామ మందిరంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. దాంతో ఇప్పటికే రానున్న కొన్ని రోజుల వరకు అయోధ్యకు వెళ్లే బస్‌లు, ట్రైన్లు, విమానాల్లో పెద్ద ఎత్తున టికెట్లు బుక్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే అయోధ్యకు వెళ్లే వారి కోసం పేటీఎం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించుకోవాలనుకునే వారి కోసం పేటీఎం ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద వెయ్యి మందికి అయోధ్యకు వెళ్లేందుకు ఉచిత బస్‌ టికెట్లు అందజేసేందుకు రెడీ అయ్యింది.

జనవరి 19న ఈ ఆఫర్‌ని ప్రారంభించింది పేటీఎమ్‌. మూడు రోజుల క్రితం మొదలైన ఈ ఆఫర్‌ కోసం జనం భారీగా ఎగబడుతున్నారు. అయితే పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే మొదటి వెయ్యి మంది ప్రయాణికులకు మాత్రమే ఈ ఉచిత బస్ టికెట్లను అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే ఈ ఫ్రీ బస్ టికెట్ పొందేందుకు పేటీఎం యాప్‌లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ‘BUSAYODHYA’ అనే ప్రోమో కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది.