iDreamPost
android-app
ios-app

ఈ రైలులో ప్రయాణించేందుకు టికెట్ అవసరం లేదు!

  • Published Sep 04, 2023 | 3:29 PM Updated Updated Sep 04, 2023 | 4:33 PM
ఈ రైలులో ప్రయాణించేందుకు టికెట్ అవసరం లేదు!

సాధారణంగా రైలు ప్రయాణం అంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను భారతీయ రైల్వే వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది. జనరల్, ఏసీ, స్లీపర్ ట్రైన్ లో ప్రయాణించేవారు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడమో.. టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకొని జర్నీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు నిత్యం ట్రైన్ లో ప్రయాణిస్తుంటారు. ఓ ట్రైన్ లో మాత్రం ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంది.. ఈ ట్రైన్ లో ప్రయాణించాలంటే ఎలాంటి వారైనా టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంతకీ ఆ ట్రైన్ ఎక్కడ అంటారా..? పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్ వర్క్ కలిగి నాలుగో స్థానంలో నిలిచింది.  దేశంలో ఎక్కడ రైలు ప్రయాణం చేయాలనుకున్నా టికెట్ తీసుకోవాల్సిందే. టికెట్ లేని ప్రయాణం చట్టరిత్యా నేరం అని ప్రతి రైల్ బోగీల్లో రాసి ఉంటుంది. అలాంటిది బాగ్దా-నంగల్ డ్యామ్ పై ప్రయాణం చేసే రైలు ప్రయాణికులు మాత్రం తమ గమ్యస్థానాలకు వెళ్లాలంటే ఎలాంటి టికెట్ తీసుకోవాల్సన అవసరం లేదు. హిమాచల్ ప్రదేశ్ – పంజాబ్ సరిహద్దుల్లో ఈ డ్యామ్ నిర్మించారు. ఈ డ్యామ్ పరిసర పరిసర ప్రాంతాల్లో ఉన్న అందమైన దృశ్యాలను తిలకించేందుకు ప్రతిరోజు వందల సంఖ్యల్లో యాత్రికులు వస్తుంటారు.

ఇక ఈ డ్యామ్ ని చూడటానికి వచ్చే ప్రయాణికులను అటూ ఇటూ తీసుకువెళ్లేందుకు  ప్రత్యేక ట్రైన్ ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణించాలంటే టికెట్ కొనాల్సిన అవసరం లేదు. మొత్తం 13 కిలోమీటర్ల దూరం వరకు ఫ్రీగా ప్రయాణించవొచ్చు. ఈ ట్రైన్ కి డిజిల్ ఇంజన్ అమర్చారు.. బోగీలను చెక్కతో తయారు చేశారు. ఈ రైలు సట్లెట్ నది, శివాలిక్ కొండల మీదుగా ప్రయాణిస్తుంది. ప్రతిరోజూ ఈ ట్రైన్ లో దాదాపు ఎనిమిదివందల మంది ప్రయాణిస్తుంటారు. ఇక్కడ ప్రకృతి అందాలను తిలకిస్తూ యాత్రికులు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల భారతీయ రైల్వే ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 508 స్టేషన్లను పునరాభివృద్దికి ప్రణాళికలు ఆవిష్కరించారు.