Video: చంద్రయాన్‌-3 గ్రాండ్‌ సక్సెస్‌! పాకిస్థాన్‌లో పేలుతున్న జోకులు

ప్రపంచ మొత్తం ఇండియాకు సలాం కొట్టింది. ఇప్పటి వరకు ప్రపంచంలో మరేదేశం కూడా సాధించినలేనిది భారత్‌ చేసి చూపించింది. చంద్రుడి దక్షిణ ద్రువంలో ల్యాండర్‌, రోవర్‌ను దింపి.. కొత్త చరిత్ర లిఖించింది. ఆగస్టు 23 సాయంత్రం 6.04 నిమిషాలకు ఈ అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. ఇస్రో(ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంతో.. భారతదేశం ప్రపంచం ముందు తలెత్తుకుని సగర్వంగా నిలబడింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ద్రువంలో అడుగుపెట్టిన తొలి దేశంగా నిలిచింది. దీంతో యావత్‌ భారతీయులంతా ఎంతో గర్వంగా సంబురాలు చేసుకున్నారు.

ఇదే సమయంలో మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా చంద్రయాన్‌-3 సక్సెస్‌పై విస్త్రతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పాకిస్థాన్‌ నటి సెహర్‌ సైతం.. చంద్రయాన్‌-3 సక్సెస్‌పై స్పందిస్తూ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపింది. అదే సమయంలో తాము సిగ్గుతో తలదించుకుంటున్నట్లు కూడా పేర్కొంది. అయితే.. చంద్రయాన్‌-3 సక్సెస్‌ కావడంతో పాకిస్థాన్‌లో భారీగా జోకులు పేలుతున్నాయి. వాటిలో ఒక వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఓ పాకిస్థానీ కుర్రాడు చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెక్‌ కావడంపై సెటైరికల్‌గా స్పందిస్తూ.. పాకిస్థాన్‌ ప్రభుత్వానికి చురకలు అంటించాడు.

అతను మాట్లాడుతూ.. ‘ఇండియా అనవసరంగా కోట్లు ఖర్చు చేసి.. చంద్రుడిపైకి వెళ్తుంది. కానీ, మేము అల్రెడీ చంద్రుడిపైనే ఉన్నాం. కావాలంటే చూడండి చంద్రుడిపై నీళ్లు లేవు, మన దగ్గరా నీళ్లు లేవు, అక్కడా గ్యాస్‌ లేదు, ఇక్కడా గ్యాస్‌ లేదు. చంద్రుడిపై కరెంట్‌ లేదు.. మా దగ్గర కూడా కరెంట్‌ లేదు’ అంటూ పాక్‌ ప్రభుత్వంపై సెటైర్లు వేశాడు. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఆ కుర్రాడు ఈ విధంగా హాస్యం పుట్టించేలా చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. మరి కిందున్న వీడియోను చూసి మీరూ నవ్వుకోండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రయాన్‌ 3 సక్సెస్‌.. ప్రకాశ్‌ రాజ్‌ని దిష్టిబొమ్మతో పోలుస్తున్న నెటిజన్లు!

Show comments