iDreamPost
android-app
ios-app

రూ.7 లక్షలు పలికిన మేక.. ఎందుకంత ప్రత్యేకత అంటే..

  • Published Jun 17, 2024 | 10:36 AM Updated Updated Jun 17, 2024 | 10:36 AM

సాధారణంగా మేక ఖరీదు.. 10 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుంది. అది కూడా మాంసం, జాతిని బట్టి రేటు. కానీ ఓ చోట మాత్రం ఏకంగా 7 లక్షల రూపాయలు పలికింది. ఆ వివరాలు..

సాధారణంగా మేక ఖరీదు.. 10 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుంది. అది కూడా మాంసం, జాతిని బట్టి రేటు. కానీ ఓ చోట మాత్రం ఏకంగా 7 లక్షల రూపాయలు పలికింది. ఆ వివరాలు..

  • Published Jun 17, 2024 | 10:36 AMUpdated Jun 17, 2024 | 10:36 AM
రూ.7 లక్షలు పలికిన మేక.. ఎందుకంత ప్రత్యేకత అంటే..

సాధారణంగా ఆదివారం పూట మన దగ్గర నాన్‌వెజ్‌కు డిమాండ్‌ బాగా ఎక్కువగా ఉంటుంది. సండే వస్తే ముక్క లేంది చాలా మందికి ముద్ద దిగదు. చికెన్‌, మటన్‌, చేపలు ఇలా ఏదో ఒకటి వండుకుంటారు. అయితే ప్రస్తుతం మటన్‌ ధరలు మండిపోతున్నాయి. కేజీ మటన్‌ ఏకంగా వెయ్యి రూపాయలు ఉంది. ఇక చికెన్‌ ధర కూడా అలానే ఉంది. ఇక పండుగల, శుభకార్యాల వేళ కొన్ని ప్రాంతాల్లో నాన్‌వెజ్‌ కచ్చితంగా పెడతారు. అందునా మటన్‌ తప్పనిసరిగా ఉంటుంది. దాంతో మన దగ్గర మేకలు, గొర్రెలు ధర భారీ పలుకుతాయి. ఇక తాజాగా ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగు చూసింది. ఒక చోట మేకను సుమారు 7 లక్షల రూపాయలకు విక్రయించారు. వామ్మో మేక ధర అంతనా.. దాని ప్రత్యేకత ఏంటి.. ఎందుకు అంత భారీ ధర చెల్లించి కొనుగోలు చేశారు అంటే..

నేడు అనగా సోమవారం నాడు ముస్లింలు పరమ పవిత్రంగా భావించే బక్రీద్‌ పండుగ. ఈ పర్వదినం నాడు కచ్చితంగా జంతు బలి ఉంటుంది. ఇది వారి ఆచారం. దాంతో బక్రీద్ పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గొర్రెలు, మేకల అమ్మకాలు భారీగా జరిగాయి. డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే బక్రీద్ సందర్భంగా.. గొర్రెలు, మేకల ధరలు రెట్టింపు అవుతాయని వ్యాపారులు అంటున్నారు. ఈ క్రమంలో ఓ చోట మాత్రం మేక​కు 7 లక్షల రూపాయలు చెల్లించి మరీ కొనుగోలు చేశారు.

బక్రీద్‌ నేపథ్యంలో.. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో గొర్రెలు, మేకల రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక్కో మేక రూ.50,000-రూ.7లక్షల 50వేల వరకు పలుకుతుందని తెలుస్తోంది. తాను పెంచిన రాఫ్తార్ అనే ఓ మేకను రూ.7 లక్షలకు విక్రయించినట్లు సయ్యద్ షాదబ్ అలీ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. దీని బరువు 155 కేజీలు ఉందని వివరించాడు. అలాగే షాన్-ఎ-భోపాల్ అనే మరో మేకను రూ.4 లక్షలకు అమ్మాడు.

తాను ముంబై, పూణె, నాగ్‌పూర్, రత్నగిరి, అహ్మదాబాద్, సూరత్, భరూచ్, రాజ్‌కోట్ వంటి నగరాలకు గొర్రెలు, మేకలను అమ్ముతుంటానని షాదబ్‌ అలీ పేర్కొన్నాడు. సాధారణ రోజుల కంటే బక్రీద్ నాడు వాటికి మంచి డిమాండ్ ఉంటుందని పెంపకపుదారుల చెబుతున్నారు. ఇక బక్రీద్ సందర్భంగా సోమవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. సోమవారం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులు కూడా మూసి ఉండనున్నాయి.