పెన్షన్ కోసం 30 కి.మి. పాకుతూ..! కన్నీరు పెట్టించే ఘటన!

భారత దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు ఎన్నో రకాలుగా ప్రజలకు చేరువు అవుతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆర్థిక లావాదేవీలు చాలా సులభతరం అయ్యాయి.

భారత దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు ఎన్నో రకాలుగా ప్రజలకు చేరువు అవుతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆర్థిక లావాదేవీలు చాలా సులభతరం అయ్యాయి.

ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎంతో అభివృద్ది సాధిస్తుంది. కమ్యూపికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఆర్థిక లావాదేవీలు కూడ సులభతరం అయ్యాయి. ఒకప్పుడు బ్యాంకుల్లో క్యూ కట్టేవారు.. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు కూర్చున్న చోటి నుంచి ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు బ్యాంకింగ్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.. ఖాతాదారులు ఏజెంట్ల సహాయంతో ఇంటి వద్దే బ్యాంకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంది కేంద్రం. దేశంలో వృద్దులకు పెన్షన్ పథకాలు అమలు చేస్తున్నారు.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్కీమ్ కొనసాగుతుంది. కొన్నిరాష్ట్రాల్లో గ్రామాల్లో నేరుగా వృద్దులకు పెన్షన్ డబ్బులు ఇస్తుంటారు.. కొన్నిచోట్ల అకౌంట్స్ లో వేస్తుంటారు. ఓ వృద్ద దివ్యాంగ మహిళ తనకు వచ్చిన పెన్షన్ ని విత్ డ్రా చేసుకోవడం కోసం బ్యాంక్ కి వెళ్లేందుకు ఎన్నో కష్టాలు పడింది.. ఆమె కష్టం చూసి ఎవరైనా చలించి పోతారు. వివరాల్లోకి వెళితే..

ఒడిశా రాష్ట్రం సుందర్‌గఢ్ జిల్లాలో ఓ వృద్ద మహిళ పరిస్తితి చూస్తే ఎంతటి కటిన హృదయులైనా కన్నీరు పెట్టుకుంటారు. జిల్లాకు చెందిన 68 ఏళ్ల దివ్యాంగ మహిళ తనకు వచ్చిన పెన్షన్ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి సుమారు 30 కిలోమీటర్ల వరకు అరచేతులు, కాళ్లతో పాకుతూ బ్యాంక్ కి వెళ్లాల్సి వచ్చింది. బాధిత వృద్ద మహిళ కుష్ణు వ్యాధితో బాధపడుతుంది.. కాళ్లకు తీవ్ర ఇబ్బంది కలిగినా.. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులు తనకు ఆసరా అవుతాయని తప్పని పరిస్థితిలో బాంక్ కి వెళ్లాల్సి వచ్చింది. తాను ప్రయాణించే రోడ్లు మట్టి రాళ్లపై చేతులు, మోకాళ్లపై పాకుతూ వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ హృదయవిదారకమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఒడిశాలోని గిరిజనులు ఎక్కువగా ఉండే సుందర్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాధిత మహిళ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ గ్రామంలో తనకు ఉన్న జబ్బు ని నయం చేయించుకోవడం కోసం వైద్యుడి వద్ద చికిత్స చేయించుకుంటుంది. అందుకోసం డబ్బులు అవసరమైన తన పెన్షన్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి ‘జన సేవా కేంద్రం’ కి వెళ్లింది. ఇందుకోసం ఆమె ఏకంగా 30 కిలో మీటర్ల వరకు పాకుతూ వెళ్లింది.  కానీ అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.. బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం చేయలేదని సేవా కేంద్రం అధికారులు చెప్పడంతో ఆమె వెనక్కి మళ్లింది. మళ్లీ తన ఆధాకర్ కార్డు ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడానికి బ్యాంక్ కి వెళ్లింది. వృద్ద మహిళ రోడ్డుపై ఎన్నో కష్టాలు పడుతూ వెళ్లడం ఓ సామాజిక కార్యకర్త గమనించాడు. ఆమెకు సహాయం అందించాడు. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే.. ఆమె బ్యాంక్ ఖాతాతో ఆధార్ కార్డు లింగ్ అయిన ఉందని, ఆమెను జనసేవా కేంద్రం అధికారులు మోసం చేసినట్లు తెలుస్తుంది. సామాజిక కార్యకర్త దగ్గరుండి ఆమెకు వెయ్యి రూపాయలు డిత్ డ్రా చేసి ఇచ్చి తిరిగి గ్రామానికి చేరేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీ అధికారులు, సిబ్బందిపై మండిపడుతున్నారు.

Show comments