iDreamPost
android-app
ios-app

జంబలకడిపంబ.. అబ్బాయి మెడలో అమ్మాయి తాళి కడితే.. ఇదిగో ఇలా!

  • Published Jun 17, 2024 | 9:08 AM Updated Updated Jun 17, 2024 | 9:08 AM

జంబలకడిపంబ సినిమా చూశారా.. దానిలో వధువు.. వరుడి మెడలో తాళి కడుతుంది. ఇది సినిమా కదా.. కానీ ఓ చోట మాత్రం ఇది వాస్తవంగా చోటు చేసుకుంది. ఆ వివరాలు..

జంబలకడిపంబ సినిమా చూశారా.. దానిలో వధువు.. వరుడి మెడలో తాళి కడుతుంది. ఇది సినిమా కదా.. కానీ ఓ చోట మాత్రం ఇది వాస్తవంగా చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Jun 17, 2024 | 9:08 AMUpdated Jun 17, 2024 | 9:08 AM
జంబలకడిపంబ.. అబ్బాయి మెడలో అమ్మాయి తాళి కడితే.. ఇదిగో ఇలా!

భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శం అంటారు. మన దగ్గర పెళ్లిని పవిత్ర బంధంగా భావిస్తారు. మన దేశంలో పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాక.. రెండు కుటుంబాలను కలిపే బంధంగా భావిస్తారు. అందుకే పెళ్లికి ముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు. తరాలు మారుతున్న కొద్ది వివాహం తంతులో అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు వివాహం అంటే.. సంప్రాదాయ పనుల కంటే.. హల్దీ, మెహందీ, సంగీత్‌, బరాత్‌ వంటి వేడుకలు బాగా పెరిగాయి. అయితే ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా.. తాళి కట్టడం, సప్తపది వంటి తంతులు మారవు. కానీ ఓ చోట మాత్రం జంబలకడిపంబ సీన్‌ అంటే.. అబ్బాయి మెడలో అమ్మాయి తాళి కట్టే సీన్‌ కనిపిస్తుంది. పైగా ఇది ప్రాంక్‌ కోసం చేసిన సీన్‌ కాదు. నిజంగా జరిగే తంతు. చాలా ఏళ్లుగా ఇది ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆ వివరాలు..

సాధారణంగా పెళ్లి అంటే అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కడతాడు. కానీ ఓ చోట మాత్రం అందుకు విరుద్ధంగా అమ్మాయి కూడా అబ్బాయి మెడలో తాళి కడుతుంది. అది కూడా మన దేశంలోనే. ఈ వింత ఆచారం ఒడిశాలో అమల్లో ఉంది. ఒడిశాలోని నువ్వుల రేవులో జరిగే పెళ్లి వేడుకలో మాత్రం.. వధువు కూడా వరుడు మెడలో తాళి కడుతుంది. పైగా ఇక్కడ ఊరంతా ఒకేసారి పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే ఎవరి పెళ్లి వారిదే. పేరుకు ఊరంతా పెళ్లిళ్లే అయినా.. ఒకేసారి జరిగినా.. ఒక్క మంటపంలో జరగవు. ఎవరి పెళ్లి వారిదే.. ఎవరి మంటపం వారిదే. సాధారణంగా నువ్వుల రేవులో 2-3 ఏళ్లకొకసారి ఇలా పెళ్లిళ్లు జరుగుతాయి.

సుమారు 3,500 మందికి పైగా కుటుంబాలున్న నువ్వుల రేవులో కనీసం 13 వేల మంది జనాభా ఉంటారు. శతాబ్దాల క్రితం ఒడిశా నుంచి వలసొచ్చిన కేవిటి కులస్తులు వాళ్లంతా. వీరంతా నువ్వలరేవు కేంద్రంగా నివాసం ఏర్పరచుకుని అక్కడే స్థిరపడ్డారు. ఇక ఈ గ్రామంలో మూడేళ్లకు ఒకసారి పెద్దల కుదిర్చిన ముహూర్తంలోనే.. ఊరిలో పెళ్లీడుకొచ్చిన యువతీయువకులకు ఒకేసారి వివాహాలు జరిపిస్తారు. ఈ గ్రామానికి చెందిన అమ్మాయిలకు.. అదే గ్రామానికి చెందిన అబ్బాయిలతో.. వివాహాలు జరిపించడం ఆనవాయితీ. అయితే ఇంటి పెద్దల అంగీకారం, అమ్మాయి, అబ్బాయిల ఇస్టానుసారమే ఈ పెళ్లిళ్లు నిర్ణయిస్తుంటారు.

వివాహం సందర్భంగా.. ఒకే ముహూర్తంలో.. అన్ని జంటలకు సామూహిక మాంగల్యధారణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. వధూవరులు కూడా పెళ్లికి చాలా ప్రత్యేకంగా ముస్తాబవుతారు. కట్నకానుకలు లేకుండా.. కేవలం అత్తారింటి నుంచి వచ్చిన దుస్తులు ధరించి.. స్నేహితులు, బంధువులు ఇచ్చిన కరెన్సీ నోట్లను దండగా మెడలో వేసుకొని.. పెళ్లి పీటలపై కూర్చుంటాడు వరుడు. అంతేకాదు.. హిందూ వివాహ పద్ధతిలో.. వరుడు.. వధువు మెడలో తాళి కడతాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే తర్వాత.. వధువు కూడా వరుడికి బంగారంతో తయారు చేసిన ఆభరణాన్ని తాళిగా కడుతుంది. దీనిని.. దురుసం అంటారు. ఇలా ఒకరి మెడలో ఒకరు తాళి కట్టడం అంటే సంసార జీవితంలో ఇద్దరు సమాన భాగస్వాములుగా.. బాధ్యతలను సమానంగా పంచుకుని.. జీవితంలో ముందుకు సాగుతామని చెప్పడం అన్నమాట. పెళ్లి కుమార్తె.. వరుడికి కట్టిన తాళిని 18 రోజుల తర్వాత తీసి తన శతమానంలో కట్టుకుంటుంది.

మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ సామూహిక వివాహాల కోసం.. చిన్నా, పెద్దా అంతా కలిసి వస్తారు. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వాళ్లంతా.. గ్రామానికి చేరుకుంటారు. వివాహాలను చూసి ఎంజాయ్‌ చేస్తారు. ఆ తర్వాత తిరిగి తమ తమ పనులకు వెళ్లి పోతుంటారు. ఈ వింత ఆచారం చుట్టపక్కల ప్రాంతాల్లో బాగా ఫేమస్‌ అయ్యింది.