iDreamPost
android-app
ios-app

జగన్నాథుడి ఆలయ రత్న భాండాగార తాళం చెవి మిస్సింగ్! సీఎం కీలక నిర్ణయం!

Ratna Bhandar Of Puri: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి దేవాలయంలోని రత్న భాండాగారంకు సంబంధించిన తాళం చెవి మిస్సింగ్‌ వ్యవహారం పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.

Ratna Bhandar Of Puri: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి దేవాలయంలోని రత్న భాండాగారంకు సంబంధించిన తాళం చెవి మిస్సింగ్‌ వ్యవహారం పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.

జగన్నాథుడి ఆలయ రత్న భాండాగార తాళం చెవి మిస్సింగ్! సీఎం కీలక నిర్ణయం!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశంపై పూరీ జగన్నాథుని ఆలయంలోని రత్న భాండాగారం గురించి. గత కొన్ని రోజుల నుంచి ఈ అంశానికి సంబంధించే అందరిలో ప్రత్యేక చర్చ జరుగుతుంది. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భండార్ తెరుచుకుంటుంది. ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు ఒడిశా ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఆమోదంతో ఈ రత్న భండార్ ని తెరవనున్నారు.  ఇదే సమయంలో ఈ ఖజానాకు సంబంధించి తాళం మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు పోయినా యాభై ఏళ్ల తరువాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. ఇక ఈ తాళం మిస్సింగ్ పై ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి దేవాలయంలోని రత్న భాండాగారంకు సంబంధించిన తాళం చెవి మిస్సింగ్‌ వ్యవహారం పెద్ద రచ్చ జరుగుతుంది. తాళం మిస్సింగ్ పై  విచారణ చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇటీవలే తాళం చెవి కనిపించకపోవడంతో డూప్లికేటు తాళాల సాయంతో అధికారుల బృందం ఆ గదిని తెరచేందుకు యత్నించగా విఫలమైంది. దాదాపు 46 యేళ్ల తర్వాత రత్న భాండాగారం ను తెరిచే ప్రయత్నం చేస్తున్న క్రమంలో  అనూహ్యంగా తాళాల అదృశ్యం కావడంతో అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి మిస్సింగ్ వెనుక ఏదో జరిగిందంటూ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్‌ మహాపాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తాళాల మిస్సింగ్‌, తర్వాత డూప్లికేట్‌ తాళాలను గుర్తించినట్టు చెప్పడంపై గందరగోళం నెలకొంది. దీంతో అసలు తాళాలు మిస్సింగ్, వాటి స్థానంలో నకిలీ తాళాలు అక్కడి రావడంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై న్యాయ శాఖ మంత్రి పృథివీరాజ్ హరిచందన్ కీలక వ్యాఖ్యలు చేశారు.నిజం బయటకు రావాలంటే దర్యాప్తు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.  అలాగే బీజేడీ ప్రభుత్వం హయాంలో నకిలీ తాళాలు చేరాయా,లేదా ? అనేది విచారణ తర్వాత స్పష్టమవుతుందని తెలిపారు. అయితే ఏ ఏజెన్సీ విచారణ చేపడుతుందనే విషయం మాత్రం మంత్రి వెల్లడించలేదు. ఇదే సమయంలో నకిలీ తాళం చెవుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది.

2018లో రత్న బాండాగారం తెరిచేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే  ప్రక్రియలో మునుపటి ప్రభుత్వం విఫలమైంది. అదే విషయం తాజాగా మరోసారి  తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ అంశంపై విచారణ జరిపినా వాస్తవాలను బయటకు వెల్లడించలేదు. ఈ క్రమంలోనే లోపలి గదికి చెందిన రెండు డమ్మీ తాళాలు వెలుగులోకి వచ్చాయి.  ఇది ఇలా ఉంటే.. రత్న భాండాగారం గురించి చరిత్ర కారులు కొన్ని కీలక విషయాలను చెబుతున్నారు. రత్న భాండాగారం కింద మరో రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్తే ఆ గదిలో విలువైన సంపద కనుగొన వచ్చని కొందరు చరిత్రకారులు చెప్పారు. నరేంద్ర కుమార్‌ మిశ్రా అనే ప్రముఖ చరిత్రకారుడు కూడా ఈ సొరంగ మార్గం వివరాలను వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి