SNP
Odisha, Bonda Tribe, Mangala Muduli, MKCG: అడవిలో పుట్టి పెరిగాడు.. ఎంతో కష్టపడి చదివాడు.. కొండలు గుట్టలు దాటి.. నీట్‌లో ర్యాంక్ కొట్టాడు. ఇప్పుడు ఒక తెగ నుంచి మొట్టమొదటి డాక్టర్ కాబోతున్నాడు. ఆ కుర్రాడి కథను ఇప్పుడు తెలుసుకుందాం..
Odisha, Bonda Tribe, Mangala Muduli, MKCG: అడవిలో పుట్టి పెరిగాడు.. ఎంతో కష్టపడి చదివాడు.. కొండలు గుట్టలు దాటి.. నీట్‌లో ర్యాంక్ కొట్టాడు. ఇప్పుడు ఒక తెగ నుంచి మొట్టమొదటి డాక్టర్ కాబోతున్నాడు. ఆ కుర్రాడి కథను ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
అడవి బిడ్డలు చాలా అమాయకంగా ఉంటారు.. జ్వరమొస్తే ఆకు పసరు మింగేస్తారు.. పెద్ద రోగం వస్తే ప్రాణాలు విడుస్తారు.. గర్భిణికి నొప్పులొచ్చినా, పిల్లలకి విషజ్వరమొచ్చినా, పెద్దలకు గుండెపోటు వచ్చినా.. అంబులెన్స్ వాళ్ల చెంతకు రాదు.. పెద్దాస్పత్రికి పోయే స్థోమత వాళ్లకు ఉండదు.. ఒక వేళ దగ్గరల్లోని సర్కారు దవఖానాకు వెళ్లాలంటే.. కర్రకు జోలె కట్టి తీసుకెళ్లాలి.. కొండలు కొనలు, వాగులు వంకలు దాటితే కానీ.. ప్రథమ చికిత్స కూడా అందదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది అడవి బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు.. సరైన వైద్యం అందక చిన్న జ్వరం కూడా తీవ్రమై విష జ్వరంగా ఊపిరి ఆపేస్తున్నారు.. ఇలాంటి దారుణ పరిస్థితుల, ఎన్నో చావులు చూస్తూ పెరిగిన ఓ కుర్రాడు.. తన జాతి తలరాతను మార్చేందుకు ‘చదువు’ను నమ్ముకున్నాడు. కొన్ని లక్షల మంది పోటీ పడే నీట్ పరీక్షలో పాసై.. ఎంబీబీఎస్ సీటు సాధించి.. ఓ గిరిజన తెగ నుంచి తొలి డాక్టర్ కాబోతున్నన్నాడు ‘మంగళ ముదులి’. కొన్ని తరాల పాటు యువతలో స్ఫూర్తి రగిల్చే 19 ఏళ్ల ఆదివాసీ ఎంబీబీఎస్ స్టూడెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ముదులి..ఒడిశా రాష్ట్రానికి చెందిన బోండా తెగకు చెందిన కుర్రాడు. అడవి, కొండల్లో నివాసం. తల్లిదండ్రులు చిన్నతరహా అటవీ ఉత్పత్తులు అమ్ముకుంటూ జీవినం సాగిస్తూ ఉంటారు. ముదులికి చిన్నతనం నుంచి చదువంటే ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే.. చదువంటే కసి. స్కూల్‌కు వెళ్లాలంటే.. 5 కిలోమీటర్ల కాలి నడకన వెళ్లాలి. అది కూడా కొండలు గుట్టలు దాటుకుంటూ.. ఒక విధంగా ట్రెక్కింగ్ చేస్తూ పోవాలి. స్థానిక రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేశాడు. అనంతరం ఇంటర్ కోసం.. తన గూడెం నుంచి 25 కిలో మీటర్ల దూరంలో ఉండే కాలేజీకి వెళ్తూనే.. నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) కోసం కూడా ప్రిపేర్ అయ్యారు. చదువుపై ముదులికి ఉన్న ఇష్టం చూసి.. స్కూల్‌లో అతనికి పాఠాలు చెప్పిన ఓ టీచర్.. అతని నీట్ కోచింగ్ కోసం సాయం చేశారు.
ఆ టీచర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. ముదులి నీట్‌లో మంచి ర్యాంకు సాధించాడు. ఎంతో మంది డబ్బున్న వారి బిడ్డలు, లక్షలకు లక్షలు పోసి.. కోచింగ్‌లు తీసుకొని కూడా సాధించలేని మెడికల్ సీటును.. ఈ అడవి బిడ్డ సాధించాడు. బెర్హంపూర్‌లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి మెడికల్ కాలేజీలో చేరాడు. నాలుగేళ్లు ఇదే కసితో చదివేస్తే.. ‘డాక్టర్ ముదులి’ అయిపోతాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. బోండా తెగ నుంచి డాక్టర్ కాబోతున్న మొట్టమొదటి వ్యక్తి ముదులినే. తన గూడెంలోని వారికి సరైన వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మూలికల వైద్యం, ఆకు పసరు లాంటి వాటితో సొంత వైద్యం చేసుకునే వారని, కొన్ని సార్లు అవి వికటించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముదులి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులే తనలో కసి పెంచాయని, తమ జీవితాలు మార్చుకోవాలంటే చదువు అనే ఆయుధాన్ని తాను నమ్ముకున్నట్లు ముదులి వెల్లడించాడు. తన జాతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమే తాను డాక్టర్ అవ్వాలనుకున్నట్లు.. ముదులి తెలిపాడు. సాధించాలనే పట్టుదల, అందుకు తగ్గ కృషి ఉంటే.. ఏదైనా సాధించవచ్చని నిరూపించిన అడవి బిడ్డ ముదలిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dear @PhysicswallahAP
Mangla Muduli is a student from the primitive Bonda tribe and is the first person from his community to qualify for NEET. He has secured a seat at Government Medical College, Berhampur, Odisha. The Bonda tribe is a special primitive community that pic.twitter.com/25txiLIMi6
— Dr. Purna Chandra Tanti (@dr_pctanti) August 29, 2024